11 బైకులు స్వాధీనం….
విశాలాంధ్ర – హిందూపురం : ఎస్పీ సతీష్ కుమార్, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, హిందూపురం డి.ఎస్.పి కె.వి. మహేష్ గారి పర్యవేక్షణలో, హిందూపురం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అంజినేయులు తోపాటు సిబ్బంది నిర్వహించిన ప్రత్యేక తనిఖీలలో భాగంగా, ద్విచక్ర దొంగతనాలకు పాల్పడిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి మొత్తం 11 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. డిఎస్పి కె.వి మహేష్ మాట్లాడుతూ, తూముకుంట చెకపోస్ట్ వద్ద సీఐ. అంజినేయులు వాహన తనిఖీలు చేపడుతుండగా, ఒకే బైకు పై ప్రయాణిస్తున్న ఇద్దరిని ఆపి వాహన పత్రాలు అడుగగా, వారు ఎటువంటి రికార్డులు చూపించలేకపోవడంతో అనుమానం తో విచారించగా సదరు బైకును రామచంద్రాపురం గ్రామం లో దొంగతనం చేసినట్టు తేలింది. అంతేకాక దీనితో పాటు మరో 10 టూ వీలర్లు బైకులను దొంగలించి రామచంద్రాపురం గ్రామంలో వారి ఇంటి పక్కన దాచి వుంచినట్లు వెల్లడించారు. నిందితులైన మోక్షిత్, ఇబ్రహీం, రఫిక్ లను అరెస్టు చేశామన్నారు. ఎస్పీ సతీష్ కుమార్ సిబ్బందిని, సిఐ ని అభినందించారు.


