Homeఆంధ్రప్రదేశ్రోడ్లను తిరిగి బాగు చేస్తాం

రోడ్లను తిరిగి బాగు చేస్తాం

- Advertisement -

తుఫానుకు దెబ్బతిన్న రోడ్లను తిరిగి బాగు చేస్తాం

……… మంత్రి కందుల దుర్గేష్

విశాలాంధ్ర  – నిడదవోలు : భారీ వర్షాలు, మొంథా తుఫాన్ కు నియోజకవర్గంలో  దెబ్బతిన్న రోడ్లను ప్రభుత్వ సహకారంతో  తిరిగి బాగు చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు.  మొంథా తుఫాన్ ధాటికి దెబ్బతిన్న కానూరు-ఉసులుమర్రు రోడ్డును మంత్రి కందుల దుర్గేష్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా దుర్గేష్ మాట్లాడుతూ తుఫాన్ కారణంగా పాడైన   కానూరు-ఉసులుమర్రు సిమెంట్ రోడ్డును రూ 3 కోట్లతో నిర్మాణం చేపట్టనున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు.   ఇప్పటికే రోడ్డు నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించి అనుమతి పొందడంతో పాటు నిధులు మంజూరు చేయించినట్లు మంత్రి దుర్గేష్ వెల్లడించారు. రోడ్డు వేసిన ప్రతిసారి దెబ్బతింటున్న నేపథ్యంలో ఈ దఫా సిమెంట్ రోడ్డు వేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును విజ్ఞప్తి చేశామన్నారు. అందుకు ఆయన అంగీకరించారని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. వర్షాలు తగ్గిన నేపథ్యంలో మరో రెండు రోజుల్లో పనులు మొదలు పెట్టాలని  అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. రూ.3.24 కోట్లతో చివటం, ఉండ్రాజవరం, తాడిపర్రు గ్రామాలను కలుపుతూ  వడ్లూరు- తీపర్రు రోడ్డు మంజూరు చేయించిటన్లు మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఇప్పటికే సంబంధిత రోడ్డుకు శంకుస్థాపన చేశామని, పనులు ప్రారంభమై పురోగతిలో ఉన్నాయని తెలిపారు.  కాల్దారి రోడ్డుకు రూ.60 లక్షలు మంజూరు చేయించామన్నారు. ఇప్పటికే ఇరువైపులా సిమెంట్ తో కూడిన అప్రోచ్ రోడ్డు నిర్మాణాలు పూర్తయ్యాయి అని వివరించారు. రూ.4.20 కోట్లతో దమ్మెన్ను, మోర్త,  ఉండ్రాజవరంలను కలుపుతూ కానూరు-లంకలకోడేరుకు నిధులు మంజూరైనట్లు తెలిపారు. ఇప్పటికే ఈ రోడ్డుకు సంబంధించిన కాంట్రాక్టర్ల తుది ఎంపిక పూర్తయిందన్నారు. త్వరలోనే పనులు మొదలుపెడతామన్నారు. ఇటీవల సీఎం చంద్రబాబునాయుడు,  డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లతో చర్చించి రూ.8.30 కోట్లతో రోడ్ల నిర్మాణాలకు అనుమతులు తీసుకొచ్చామని మంత్రి దుర్గేష్ అన్నారు. అందులో భాగంగా రూ.4.15 కోట్లతో ఖండవల్లి- ముక్కామల రోడ్డు, రూ.4.15 కోట్లతో దువ్వు- తీతలి, మునిపల్లి రోడ్డును నిర్మించనున్నామన్నారు. ఈ క్రమంలో సూర్యారావుపాలెం, పసలపూడి గ్రామాలకు రోడ్డు వేయనున్నామన్నారు. టెండర్లు పిలిచాక పనులు ప్రారంభిస్తామన్నారు. ఇవి కాకుండా పంచాయతీ రాజ్ శాఖ తరపున ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో నియోజకవర్గంలో రూ.11 కోట్లతో గ్రామాల్లో అంతర్గత రోడ్లను బాగు చేయించామని మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు. ఈ మధ్య కాలంలో మరిన్ని ప్రతిపాదనలు పంపించి మరో రూ.5 కోట్లను మంజూరు చేయించామన్నారు. ఎంపీ ల్యాడ్స్ నుండి కొన్ని నిధులు తీసుకొని రోడ్లను బాగు చేయడంతో పాటు పురందేశ్వరితో మాట్లాడి కమ్యూనిటీ హాళ్లను నిర్మిస్తున్నామన్నారు.  ఇంకా కొన్ని గ్రామాల్లో రోడ్లను వేయడంతో పాటు డ్రైన్లు నిర్మించాల్సిన అవసరాన్ని మంత్రి దుర్గేష్ వివరించారు. మరో నెల రోజుల్లో పుంత రోడ్లు, డ్రైన్లు బాగు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించినట్లు మంత్రి దుర్గేష్ తెలిపారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అవసరమైన నిధులు సమీకరిస్తున్నా మన్నారు.గత ప్రభుత్వం రహదారుల అభివృద్ధిని పట్టించుకోని కారణంగా రోడ్లన్నీ పూర్తిగా శిధిలావ్యస్థకు చేరాయని  మంత్రి దుర్గేష్ విమర్శించారు. మరమ్మత్తులకు కూడా కనీసం తట్టెడు మట్టి కూడా వేయలేని దౌర్భాగ్యస్థితిని గడిచిన ఐదేళ్లలో చూశామన్నారు. ఈ పరిస్థితిని గమనించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం గుంతల రహిత ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం చేపట్టి తాత్కాలికంగా రోడ్ల మరమ్మతులు చేపట్టామన్నారు. తద్వారా ఆర్ అండ్ బీ, అంతర్గత రోడ్లు బాగుపడ్డాయన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని రోడ్ల నిర్మాణాలకు అనుమతులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు