Homeజిల్లాలుశ్రీ సత్యసాయిపేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే మా లక్ష్యం..

పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే మా లక్ష్యం..

- Advertisement -

యువర్స్ ఫౌండేషన్ అధ్యక్షులు షీలా నాగేంద్ర
విశాలాంధ్ర ధర్మవరం:: పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే మా లక్ష్యము అని యువర్స్ ఫౌండేషన్ అధ్యక్షులు షీలా నాగేంద్ర, కార్యదర్శి జయరాం కోశాధికారి వంకదారి మోహన్, క్యాంపు చైర్మన్ వంకదారి రామచంద్ర గుప్తా తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో (వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా) ఉచిత ఐఓఎల్ కంటి వైద్య శిబిరమును నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ శిబిరం యువర్స్ ఫౌండేషన్, జిల్లా అందత్వ నివారణ సంస్థ శ్రీ సత్య సాయి జిల్లా, నేత్ర జ్యోతి కంటి ఆసుపత్రి బెంగళూరు వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందన్నారు. ఈ శిబిరానికి దాతలుగా కీర్తిశేషులు గంజికుంట విజయలక్ష్మి కీర్తిశేషులు గంజికుంట రంగనాయకులు, జ్ఞాపకార్థం వారి కుమారులు గంజికుంట శ్రీధర్ బాబు అండ్ బ్రదర్స్ (శ్రీ రుక్మిణి సిల్క్ ఎంపోరియం ధర్మవరం) వ్యవహరించడం పట్ల వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ శిబిరంలో 79 మంది కు కంటి వైద్య పరీక్షలు నిర్వహించగా అందులో 43 మంది కంటి ఆపరేషన్లకు ఎంపిక కావడం జరిగిందని తెలిపారు. ఇప్పటికే యువర్స్ ఫౌండేషన్ సంస్థ పలు రకాల సేవా కార్యక్రమాలను కూడా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సహకార దర్శి గొర్రె రమేష్ బాబు, పోలా ప్రభాకర్, వైకే శ్రీనివాసులు, పిఆర్వో రాధాకృష్ణ, కోటేశ్వరరావు, కేతా లోకేష్, రామాంజనేయులు, నాగార్జున తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు