Homeజిల్లాలుఅనంతపురంనూతన సచివాలయం ప్రారంభోత్సవం

నూతన సచివాలయం ప్రారంభోత్సవం

- Advertisement -

విశాలాంధ్ర – గుమ్మగట్ట: రాయదుర్గం మండలంలోని బీఎన్ హల్లి గ్రామంలో నూతన గ్రామ సచివాలయ భవనాన్ని ప్రభుత్వవిప్ కాల్వ శ్రీనివాసులు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు సౌకర్యవంతమైన,పారదర్శకమైన సేవలు అందించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని.గ్రామ అభివృద్ధి, ప్రజా సేవల బలోపేతం పట్ల కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని. ప్రతి గ్రామంలోనూ సమగ్ర అభివృద్ధి సాధించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ స్కీమ్ ద్వారా 7 గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు మంజూరయ్యాయని ప్రకటించారు. నియోజకవర్గంలోని డి హీరేహాల్, కనేకల్ మండలాలకు 2 చొప్పున ,బొమ్మనహాళ్ మండలానికి 3 గ్రామీణ ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణాలకు ఒక్కొక్కటికి సుమారు 42 లక్షల రూపాయల ఖర్చుతో నిర్మించబోతున్నట్లు.అలాగే 15వ ఆర్థిక సంఘం నిధులతో నాలుగు కేంద్రాలకు గాను ఒక్కక్కటికి 36 లక్షల రూపాయలు.అసంపూర్తిగా ఉన్న మరో 24 కేంద్రాలకు గాను 3 కోట్ల 50 లక్షల రూపాయలు .మొత్తం ఈ సంవత్సరం గ్రామీణ ఆరోగ్య కేంద్రాల భవన నిర్మాణాలకు 7.88 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ డీఈఈ సుధాకర్ నాయక్,ఎంపిడిఓ కొండయ్య, మండల ఇంజనీర్ ఏఈ మునిస్వామి, సచివాలయ సిబ్బంది, మండల కన్వీనర్ హనుమంతు,టీడీపీ నాయకులు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు