Homeట్రంప్‌ పాలనకు ఛీత్కారం

ట్రంప్‌ పాలనకు ఛీత్కారం

- Advertisement -

. న్యూయార్క్‌ మేయర్‌గా సోషలిస్టు జొహ్రాన్‌ మమ్దానీ
. స్థానిక పోరులో డెమొక్రాట్ల ప్రభంజనం
. వర్జీనియాలో భారత సంతతి ముస్లిం ఎన్నిక
. న్యూజెర్సీ, కాలిఫోర్నియా, సిన్సినాటిలోనూ రిపబ్లికన్లు చిత్తు

న్యూయార్క్‌: ట్రంప్‌ సర్కారుకు స్థానిక ఎన్నికల్లో గట్టి ఎదురు దెబ్బ తిగిలింది. ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో రిపబ్లికన్లు ఘోర పరాభవాన్ని చవిచూశారు. 2024 ఎన్నికలప్పుడు ట్రంప్‌ హవాలో కొట్టుకుపోయిన డెమొక్రాట్‌ పార్టీకి ఈ ఎన్నికలతో కొత్త ఊపిరి లభించింది. ఆ పార్టీ అభ్యర్థులు ఘన విజయాలతో చరిత్ర సృష్టించారు. ప్రత్యేకించి భారత సంతతి దక్షిణాసియా మూలాలుగల ముస్లింల ఎన్నిక విశేషంగా నిలిచింది. నవంబరు 4న జరిగిన ఎన్నికలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. వర్జీనియా నుంచి కాలిఫోర్నియా వరకు ప్రచారం చేశారు. ఒకప్పుడు రిపబ్లికన్లకు అనుకూలమైన ఈ ప్రాంతాల్లో డెమొక్రాట్లు పాగా వేశారు. రిపబ్లికన్లు చిత్తు అయ్యారు. మేయర్‌, గవర్నర్ల ఎన్నికలో రిపబ్లికన్లకు డెమొక్రాట్లు చెక్‌ పెట్టారు. ఎక్కడికక్కడ మెజారిటీ సాధించారు. ట్రంప్‌ పాలనపై ప్రజా వ్యతిరేకతకు ఈ ఫలితాలు అద్దంపట్టాయి. కొత్తగా ఎన్నికైన మేయర్లు, గవర్నర్లు తమ విజయోత్సవ సభల్లో ట్రంప్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సుంకాల పాలన అంటూ దుయ్యబట్టారు. కార్మికులపై దాడులను ఆక్షేపించారు.
ట్రంప్‌ 2.0 పాలనలో జరిగిన తొలి మేయర్‌ ఎన్నికలను డెమొక్రాట్లు క్లీన్‌స్వీప్‌ చేయడం పెద్దఎత్తున చర్చకు దారితీసింది. ట్రంప్‌ యంత్రాంగంపై ప్రజాభిప్రాయ సేకరణగా ఈ ఎన్నికను నిపుణులు భావించారు. ట్రంప్‌ నిరంకుశత్వాన్ని ప్రజలు తిరస్కరించారన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. న్యూయార్క్‌తో పాటు కాలిఫోర్నియా, న్యూ జెర్సీ, వర్జినీయాల్లోనూ డెమొక్రాట్లు ప్రభంజనం సృష్టించారు.
న్యూయార్క్‌ మేయర్‌గా డెమొక్రాట్‌ అభ్యర్థి జొహ్రాన్‌ మమ్దానీ (34) చారిక్రత విజయం సాధించారు. న్యూజెర్సీలోనూ డెమొక్రాట్‌ అభ్యర్థి మైకీ షెర్గి విజేతగా నిలిచారు. 1960 దశకం తర్వాత వరుసగా మూడుసార్లు న్యూజెర్సీ గవర్నర్‌ పదవి డెమొక్రాట్లకు దక్కడం విశేషం. వర్జీనియా మేయర్‌గా అబిగెయిల్‌ స్నాన్‌బర్గర్‌, లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా భారత సంతతికి చెందిన గజాలా హాష్మీ (61) ఎన్నికయ్యారు. దక్షిణాసియా మూలాలున్న తొలి ముస్లిం లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా హాష్మీ నిలిచారు. రిపబ్లికన్‌ జాన్‌ రైడ్‌ను చిత్తు చేశారు. ఓహియో రాష్ట్రంలోని సిన్సినాటి నగర మేయర్‌గా భారత సంతతికి చెందిన అఫ్తాబ్‌ పురేవాల్‌ (43) ఎన్నికయ్యారు. రిపబ్లికన్‌ అభ్యర్థి, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ సోదరుడు కోరి బ్రోమన్‌పై అఫ్తాబ్‌ విజయం సాధించారు. రెండవసారి మేయర్‌గా ఎన్నికయ్యారు. అఫ్తాబ్‌ తల్లి టిబెట్‌కు చెందిన వారు కాగా, ఆయన తండ్రి పంజాబీ.
ఎన్నికలు జరిగిన స్థానాల్లో చాలా వరకు గతంలో ట్రంప్‌కు అనుకూలమే అయినప్పటికీ రిపబ్లికన్‌ అభ్యర్థులను ప్రజలు తిరస్కరించారు. జొహ్రాన్‌ మమ్దానీకి వ్యతిరేకంగా ట్రంప్‌ పెద్దఎత్తున ప్రచారం చేశారు. ఆయన ఎన్నికైతే న్యూయార్క్‌ నాశనమవుతుందని హెచ్చరించారు. కానీ న్యూయార్క్‌ ప్రజలు అధ్యక్షుడి మాటలను లెక్కచేయలేదు. మందానీకి చారిక్రత విజయాన్ని అందించారు. దశాబ్దాల తర్వాత భారీగా పోలింగ్‌ జరిగిందని, 20 లక్షల మందికిపైగా ఓటేశారని ఎన్నికల అధికారులు వెల్లడిరచారు.
మమ్దానీ నోట నెహ్రూ మాట
న్యూయార్క్‌ మేయర్‌గా ఎన్నికైన జొహ్రాన్‌ మమ్దానీ తన విజయోత్సవ సభలో ప్రసంగిస్తూ భారతదేశ తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూను గుర్తుచేసుకున్నారు. ‘ట్రిస్ట్‌ విత్‌ డెస్టినీ’ని ప్రస్తావించారు. ‘నవశకం వైపు అడుగు వేసినప్పుడు, ఒక శకం ముగిసినప్పుడు, సుదీర్ఘ అణచివేతకు గురైన జాతి గళం వినిపించినప్పుడు… చరిత్రలో ఇలాంటి క్షణాలు అరుదుగా వస్తాయి’ అని అన్నారు.
రిచర్డ్‌ అనే ట్యాక్సీ డ్రైవర్‌తో కలిసి సిటీ హాల్‌ వెలుపల 15 రోజులు దీక్ష చేయడం గురించి ప్రస్తావించారు. తన తల్లిదండ్రులకు, ప్రత్యేకించి యువతరానికి కృతజ్ఞతలు తెలిపారు. రాజకీయ రాజవంశాన్ని కూల్చేశామంటూ ట్రంప్‌నకు చురకలు అంటించారు. ‘ట్రంప్‌… మీరు చూస్తున్నారని తెలుసు. మీకు నాలుగు మాటలు చెబుతా.
సౌండ్‌ పెంచి వినండి. మీరు మాలో ఎవరిని చేరుకోవాలంటే మా అందరినీ దాటాల్సి ఉంటుందని గుర్తుపెట్టుకోండి. మీకు జన్మనిచ్చిన నగరంలో ఓడిపోయారని మరవొద్దు’ అని డెమొక్రాట్‌ నేత వ్యాఖ్యానించారు. తన ప్రత్యర్థి, మాజీ గవర్నర్‌ ఆండ్రూ క్యూమోను ఉద్దేశించి వ్యక్తిగత జీవితంలో ఉత్తమంగా ఉండాలని మమ్దానీ సూచించారు.
ఓటమికి ఆ రెండే కారణాలు: ట్రంప్‌
తాజా ఎన్నికల ఫలితాలపై ట్రంప్‌ అసంతృప్తి వ్యక్తంచేశారు. రిపబ్లికన్‌ పార్టీ ఓటమికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయని చెప్పారు. మొదటిది బ్యాలెట్‌పై తన పేరు లేకపోవడమని, రెండవది… నెల రోజులుగా షట్‌డౌన్‌ కొనసాగుతుండ టమని వెల్లడిరచారు. ఈ మేరకు ఆయన ట్రూత్‌ సోషల్‌లో పేర్కొన్నారు. కాలిఫోర్నియాలో రిగ్గింగ్‌ జరిగిందని కూడా ఆరోపించారు. ‘రాజ్యాంగానికి విరుద్ధమైన రీ మ్యాపింగ్‌ పేరుతో కాలిఫోర్నియా ఎన్నికల్లో రిగ్గింగ్‌ జరిగి ంది. మెయిల్‌-ఇన్‌ ఓట్లు పక్కనబెట్టేయ డం తీవ్రంగా పరిగణించాల్సిన అంశం’ అని ట్రంప్‌ వెల్లడిరచారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు