విశాలాంధ్ర ధర్మవరం; నేత్రదానముతో రెండు కుటుంబాల్లో వెలుగులు నింపిన నేత్రదాత తమ్మిశెట్టి నాగయ్య అని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన తమ్మిశెట్టి నాగయ్య (80) మృతి చెందడంతో కుటుంబ సభ్యులకు యువర్స్ ఫౌండేషన్ సభ్యులు నేత్రదానంపై అవగాహన కల్పించడం జరిగింది. దీంతో ఆ కుటుంబ సభ్యులు నేత్ర దానమునకు అంగీకరించడంతో జిల్లా అంధత్వ నివారణ సంస్థ అనంతపురం రెడ్ క్రాస్ సొసైటీ కుళ్లాయప్ప, కంటి రెట్రైవల్ సెంటర్ సహకారంతో టెక్నీషియన్ రాఘవేంద్ర డాక్టర్ బి వి సుబ్బారావు కంటి కార్నియాను సేకరించారు.
నేత్రదానానికి సహకరించిన దాత భార్య లక్ష్మీదేవి కుమారులు కాశీ విశ్వనాథ్, నాగేష్ కు యువర్స్ ఫౌండేషన్ వారు కృతజ్ఞతలు తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో యువర్స్ ఫౌండేషన్ సభ్యులు వై కే. శ్రీనివాసులు, సమాజ సేవకుడు, కౌన్సిలర్ కేతా లోకేష్ పాల్గొన్నారు.
నేత్ర దానంతో రెండు కుటుంబాల్లో వెలుగులు చూపించిన నేత్ర దాత
- Advertisement -
RELATED ARTICLES


