Homeఅంతర్జాతీయంహెచ్‌1బీ వీసాపై ట్రంప్‌ యూటర్న్‌

హెచ్‌1బీ వీసాపై ట్రంప్‌ యూటర్న్‌

- Advertisement -

అమెరికాకు విదేశీ ప్రతిభ అవసరమని అంగీకారం
వాషింగ్టన్‌: హెచ్‌1బీ వీసా నిబంధనలను కఠినతరం చేస్తూ విదేశీ ఉద్యోగులపై కొరఢా విధించేందుకు ప్రయత్నించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇప్పుడు వెనక్కి తగ్గారు. హెచ్‌1బీ వీసా విషయంలో స్వరం మార్చారు. తమ దేశానికి విదేశీ నైపుణ్యతప్రతిభ అవసరమని అంగీకరిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచ నలుమూలల నుంచి ప్రతిభను అమెరికాకు తెచ్చుకోవల్సిన అవసరం ఉందని వక్కాణించారు. అయితే విదేశీ ఉద్యోగులపై ఆధారాన్ని తగ్గించుకోవాలంటే ముందుగా అమెరికాన్లు ప్రతిభ పెంచుకోవాలని, ఆయా నైపుణ్యతలు, మెళకులు నేర్చుకోవాలని సూచించారు. ఫాక్స్‌ న్యూస్‌ ఇంటర్వ్యూలో ట్రంప్‌ ఈ మేరకు మాట్లాడారు. దేశంలో ప్రతిభాకు కొదవ లేదన్న వ్యాఖ్యత వ్యాఖ్యలను తోసిపుచ్చారు. విదేశీ ప్రతిభ దేశానికి అవసరమన్నారు. నిరుద్యోగులన్న కారణంగా ప్రతిభలేని వారికి ఫ్యాక్టరీలో పని ఇప్పించి క్షిపణులు తయారు చేయమంటే ఏం జరుగుతుందో అర్థంచేసుకోవచ్చన్నారు. ‘అక్రమ వలసదారులపై జార్జియాలో దాడిని ప్రస్తావిస్తూ అక్కడ బ్యాటరీలు తయారీలో జీవితం మొత్తం గడిపిన దక్షిణ కొరియాకు చెందిన కార్మికులు ఉన్నారు. బ్యాటరీల తయారీ ఆషామాషీ వ్యవహారం కాదు. అది చాలా కష్టం. ఎంతో నైపుణ్యతతో పని జరిగాలి. లేదంటే పేలుళ్లు వంటి ప్రమాదాలు జరగవచ్చు. కనీసం 500600 మంది దశ వారీగా బ్యాటరీలు తయారు చేయగలిగిన వారు అక్కడున్నారు. ఆ కార్మికులను తొలగించాలంటే వారి స్థానాన్ని భర్తీ చేయగలిగిన నైపుణ్యత అమెరికాలో ఉండాలి. బ్యాటరీల తయారీ వంటి పరిశ్రమలకు ప్రత్యేక నైపుణ్యత కావాలి. శిక్షణ లేని వారిని తీసుకెళ్లి పెడితే ప్రమాదాలు జరుగుతాయి’ అని ట్రంప్‌ అన్నారు. గత ఐదేళ్లుగా పని చేయని నిరుద్యోగులను తీసుకొచ్చి క్షిపణులు తయారు చేయమంటే ఏం జరుగుతుందని ప్రశ్నించారు. కాగా, హెచ్‌`1బీ వీసా దుర్వినియోగంపై 175 విచారణలకు ట్రంప్‌ సర్కారు ఇటీవల ఆదేశాలిచ్చింది. ఈ మేరకు అమెరికా కార్మిక శాఖ ఎక్స్‌లో పేర్కొంది. ఉద్యోగాల్లో స్థానికులకు తొలి ప్రాధాన్యతిచ్చే దిశగా తమ ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటోందని ఆ శాఖ తెలిపింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు