సత్య సాయి బాబా సేవా కమిటీ సేవలు అభినందనీయం…
ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య
విశాలాంధ్ర నందిగామ:-సేవా మార్గంలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబా సేవా కమిటీ ముందుంటుందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు గురువారం మండల పరిధిలోని మునగచర్ల గ్రామంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 100వ జన్మదినోత్సవ సందర్భంగా గ్రామంలో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు ఈ శిబిరంలో చిన్న పెద్ద పశువులకు ఉచిత వైద్య సేవలు, పోషకాహారణ సలహాలు పశు సంరక్షణ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించటం రైతులకు మేలు జరుగుతుందని అన్నారు సత్య సాయి బాబా సేవ తత్వం సమాజ శ్రేయస్సుకు మార్గదర్శకం అని అన్నారు ఆయన శతజయంతి సందర్భంలో ప్రజలకు రైతులకు ఉపయోగపడే విధంగా నిర్వహిస్తున్న ఈ సేవా కార్యక్రమాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు సత్య సాయి బాబా సేవ కమిటీ సేవలను ప్రభుత్వం తరఫున కొనియాడుతున్నానని అన్నారు పశు వైద్యులను అధికారులను దుస్యాలువాలతో సన్మానించారు ఈ కార్యక్రమంలో సేవా కమిటీ సభ్యులు గ్రామ సర్పంచ్ పంగులూరు నరసింహారావు,నందిగామ మార్కెట్ యార్డ్ చైర్మన్ పిట్టల శ్రీదేవి,వైస్ చైర్మన్ అమ్మినేని జ్వాలా ప్రసాద్, గ్రామ టిడిపి నాయకులు,పశు వైద్య అధికారులు సేవా కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు…


