విశాలాంధ్ర -వలేటివారిపాలెం : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆంధ్ర ప్రదేశ్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి క్రీడా పోటీల ఎంపికలలో భాగంగా తేదీ 18. 11. 2025న నెల్లూరు జిల్లా సింగరాయకొండ మండలం పాకల జిల్లా పరిషత్ హై స్కూల్ నందు జిల్లా ఖో. ఖో జట్ల ఎంపిక జరిగింది.ఈ ఎంపికలో పాల్గొన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వలేటివారిపాలెం విద్యార్థులు 17 సంవత్సరాల విభాగంలో చప్పిడి అశ్విత, 14 సంవత్సరాల విభాగంలో చొప్పర లోకేష్,, ఈర్ల పూజిత రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొనటానికి అర్హత సాధించారు.
అదేవిధంగా తేదీ 19. 11.2025న కనిగిరి నియోజకవర్గం కంచర్ల వారి పల్లి లో జరిగిన జిల్లా కబడ్డి సెలక్షన్స్ నందు 17 సంవత్సరాల విభాగంలో మర్రి మని విష్ణు, 14 సంవత్సరాల విభాగంలో గూడూరు సంతోష్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనారు.
వీరందరూ త్వరలో కర్నూల్, మచిలీపట్నం లో జరగబోవు రాష్ట్రస్థాయి ఖో. ఖో,, కబడ్డీ పోటీలలో పాల్గొంటారని పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ కత్తి ఇజక్ తెలిపారు. రాష్ట్రస్థాయిలో కూడా ప్రావీణ్యం సాధించి పాఠశాలకు అదేవిధంగా గ్రామానికి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ ఎస్వీఎన్ కమల్ కుమార్ తెలియజేసి వారిని అభినందించారు..అదేవిధంగా పాఠశాల ఉపాధ్యాయనీ, ఉపాధ్యాయులు విద్యార్థులకు ఆశీస్సులు అందించి మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు.స్థానిక పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ కత్తి ఐజక్ ను పలువురు అభినందించి మునుముందు విద్యార్థులను ఇలాగే తీర్చిదిద్దాలని శుభాకాంక్షలు తెలియజేశారు.
రాష్ట్రస్థాయి కబడ్డీ,ఖో. ఖో పోటీలకు వలేటివారిపాలెం హైస్కూల్ విద్యార్థులు ఎంపిక
- Advertisement -


