విశాలాంధ్ర -అనంతపురం : సిపిఐ మైనారిటీ విభాగం ఁఇన్సాఫ్ఁ రాష్ట్ర కార్యదర్శి గా జాఫర్, ఉపాధ్యక్షులుగా ఖాజా హుస్సేన్ ఇన్సాఫ్ నూతన కమిటీ ను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జులు ఈశ్వరయ్య సమక్షంలో ఎన్నుకోవడం జరిగింది.ఆల్ ఇండియా తంజీమ్-ఎ- ఇన్సాఫ్ రాష్ట్ర ముఖ్య కార్యకర్తల సమావేశం విజయవాడలో నిర్వహించారు. ఎన్నికైన సందర్భంగా వారు మాట్లాడుతూ ,… మైనారిటీల సంక్షేమం, విద్య , సామాజిక న్యాయం, స్థానిక సమస్యల పై పోరాడుతాం అని పేర్కొన్నారు ..వక్ఫ్ ఆస్తుల సంరక్షణ ఎంతో అనివార్యం , వాటి కొరకు మైనారిటీలు అందరూ కలిసి పోరాడాలన్నారు. అనంతరం నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు ఈశ్వరయ్యను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


