విశాలాంధ్ర ధర్మవరం;; ధర్మవరం నివాసంగా ఉంటూ కొత్తచెరువు మండలంలో వ్యాయామ ఉపాధ్యాయునిగా విధులు నిర్వర్తిస్తున్న బి శివకృష్ణ విజయవాడలో ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్రస్థాయి సివిల్ సర్వీసెస్ లాండ్ టెన్నిస్ పోటీలలో రాష్ట్రస్థాయి పోటీల్లో మూడవ స్థానమును పొందడం జరిగిందని టెన్నిస్ క్రీడాకారుడు బి. శివకృష్ణ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ గుజరాత్లో డిసెంబర్ 16వ తేదీ నుండి జరగబోవు జాతీయ సాయి పోటీలలో ఆంధ్రప్రదేశ్ తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారని వారు తెలిపారు. ఇందులకు ఆ పాఠశాల హెడ్మాస్టర్ మంజుల వాణి పాఠశాల ఉపాధ్యాయ బృందం హర్షం వ్యక్తం చేశారు. అంతేకాకుండా తాను ధర్మవరంలోని కళాజ్యోతి సర్కిల్లో టెన్నిస్ సాధన చేస్తూ ఇంతటి విజయాన్ని సాధించడం నాకెంతో సంతోషాన్ని కలిగించిందని తెలిపారు. ఈ సందర్భంగా కళాజ్యోతి అధ్యక్షులు నారాయణప్ప, కార్యదర్శి రామకృష్ణ, కళా జ్యోతి టెన్నిస్ క్రీడాకారులు వర్షం వ్యక్తం చేశారు.
టెన్నిస్ పోటీలలో రాష్ట్రస్థాయి మూడవ స్థానం పొందిన వ్యాయామ ఉపాధ్యాయుడు బి శివకృష్ణ
- Advertisement -
RELATED ARTICLES


