Homeజిల్లాలుఅనంతపురంమెజారిటీ మీడియా బిజెపి చేతుల్లో ఉండడంతోనే ఎన్నికల్లో గెలుపు

మెజారిటీ మీడియా బిజెపి చేతుల్లో ఉండడంతోనే ఎన్నికల్లో గెలుపు

- Advertisement -

దేశంలో ఎన్.డి.ఏ పథకాలు అభివృద్ధి విషయంలో అసంతృప్తి
-సీఎం చంద్రబాబు ఎన్నికలప్పుడు ఒక మాట తర్వాత మరో మాట
-సిపిఐ జిల్లా కార్యదర్శి పాళ్యం నారాయణస్వామి ధ్వజం

విశాలాంధ్ర-రాప్తాడు : దేశంలో ఎన్.డి.ఏ పథకాలు, అభివృద్ధి విషయంలో పెద్ద ఎత్తున అసంతృప్తి ఉన్నా
మెజారిటీ మీడియా వారి చేతుల్లో ఉండడంతోపాటు ఓట్ల గోల్ మాల్ జరుగుతుండడంతో అన్ని ఎన్నికల్లో గెలుస్తున్నారని దీనికి భవిష్యత్తులో అడ్డుకట్ట వేయాల్సిన అవశ్యకత ఉందని సిపిఐ జిల్లా కార్యదర్శి పాళ్యం నారాయణస్వామి పిలుపునిచ్చారు. వచ్చే 26వ తేదీన ఖమ్మంలో జరిగనున్న సిపిఐ శత జయంతి వేడుకల సందర్భంగా శనివారం రాప్తాడు సి.పి.ఐ మండల కార్యదర్శి ఆర్.రవీంద్ర ఆధ్వర్యంలో నియోజకవర్గ జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా సిపిఐ జిల్లా కార్యదర్శి పి. నారాయణస్వామితోపాటు, జిల్లా సహాయ కార్యదర్శి చిరుతల మల్లికార్జున, సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పి రామకృష్ణ, గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి వై.యల్. రామాంజనేయులు,రాప్తాడు నియోజకవర్గం కార్యదర్శి ఎం రమేష్ హాజరయ్యారు. ఇందులో భాగంగా బూటకపు ఎన్కౌంటర్లకు బలైన అమరులకు, సిపిఐ అమరులకు సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం బూటకపు ఎన్కౌంటర్లకు ఆజ్యం పోస్తున్నారని విమర్శించారు. ఇటీవల భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్. గవాయి పైన ఆర్ఎస్ఎస్ న్యాయవాది బూటుతో దాడి చేసి రాజ్యాంగాన్ని అవమానించారన్నారు. బీహార్ లో 65 లక్షల ఓటర్లను తీసేసారని పెద్ద ఎత్తున దుమారం లేచినా కూడా బిజెపి గెలిచిందన్నారు. కారణం దేశంలో బిజెపి అధికారంలో ఉండడమేనన్నారు. బెంగళూరులో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా ఫలితాలు బిజెపికి అనుకూలంగా రావడం బాధాకరమన్నారు. రాష్ట్రంలో కూడా ప్రభుత్వం సూపర్ సిక్స్ అంటూ అధికారంలోకి వచ్చి ఇప్పుడు అరకొరగా అమలు చేస్తూ ప్రజలను మోసం చేస్తోందన్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో ఎన్.డి.ఏ కూటమికి వ్యతిరేకంగా సిపిఐ రాజకీయ విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. చిరుతల మల్లికార్జున మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఎన్నికలప్పుడు ఒక మాట తర్వాత మరో మాట చెప్పడం పరిపాటైందన్నారు.
ఎన్నికల ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సూపర్ సిక్స్ పేరిట ఆరు పథకాలని హామీ ఇచ్చి వాటికి కోత విధిస్తున్నారని ఆరోపించారు. యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు లేదా నిరుద్యోగ భృతి ఇస్తామని రెండేళ్లు గడుస్తున్న కూడా దానిపైన దిశానిర్దేశం లేదన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలు ఇస్తామని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని ఎగనామం పెట్టారని ధ్వజమెత్తారు. ఓట్లు వేయించుకొని ప్రజలు మోసం చేస్తే గత ప్రభుత్వానికి పట్టిన గతి ఈ ప్రభుత్వానికి కూడా పడుతుందని హెచ్చరించారు. ఈ అలాగే డిసెంబర్ 26న ఖమ్మంలో జరిగే శత జయంతి ఉత్సవాలకు అనంతపురం జిల్లా నుంచి అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సహాయ కార్యదర్శి నీళ్లపాల రామకృష్ణ, రైతు సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ వన్నారెడ్డి, రైతు సంఘం నాయకులు నగేష్, అనంతపురం రూరల్, ఆత్మకూరు మండల కార్యదర్శులు నరేష్, బండారు శివ, రూరల్ సహాయ కార్యదర్శి దుర్గాప్రసాద్, నియోజకవర్గ కార్యవర్గ సభ్యులు శ్రీకాంత్,రాకెట్ల రాము, రాప్తాడు మండల సహాయ కార్యదర్శి చలపతి, మహిళా సంఘం నాయకురాలు వరలక్ష్మి, శాఖ సెక్రెటరీలు అజయ్, అక్కలప్ప, నల్లప్ప, ప్రసాద్,రఫీ, నారాయణస్వామి, జి.పి.ఓబులేష్ కాలనీ ల నాయకులు మహేంద్ర,నాగభూషణ కుల్లాయప్ప తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు