Homeఆంధ్రప్రదేశ్రేషన్ వెనక్కే

రేషన్ వెనక్కే

- Advertisement -

రేషన్ కార్డుదారులూ.. బహుపరాక్..

 మూడు నెలలైనా పూర్తికాని పంపిణీ..

 ఈ నెలాఖరు వరకే ఛాన్స్..

 ఆ తర్వాత వెనక్కే..?

 విశాలాంధ్ర – కొవ్వూరు : రేషన్ దుకాణాలలో అక్రమాలను అరికట్టేందుకు కూటమి ప్రభుత్వం కొత్త స్మార్ట్ కార్డులు అందుబాటులోకి తెచ్చింది. కానీ చాలామంది లబ్ధిదారులు ముఖ్యంగా వలస వెళ్లిన వారు ఇంకా కార్డు తీసుకోలేదు. జిల్లాలో అనేక మండలాలలో వేలాదిగా కార్డులు మిగిలిపోయాయి. ఈనెల 30 లోపు కార్డులు తీసుకోకపోతే అవి రద్దవుతాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. అలాగే ప్రతి ఐదేళ్లకోసారి ఈ కేవైసీ చేయించుకోవాలని లేదంటే పథకాలు ఆగిపోతాయని సూచిస్తున్నారు. రేషన్ డీలర్ల పర్యవేక్షణలో గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల ద్వారా జరుగుతున్న ఈ కార్డులు పంపిణీ ఇంకా పూర్తి కాకపోవడం పట్ల ప్రభుత్వం అసహనం వ్యక్తం చేస్తుంది . ఈ క్రమంలో అసలు రేషన్ కార్డుదారులు ఉన్నారా లేదా అంటూ స్థానికంగా ఆరా తీస్తున్నారు.  ఒకవేళ ఎవరైనా స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకోవాలంటే కార్డులోని సభ్యులు ఎవరో ఒకరు వెళ్లి బయోమెట్రిక్ వేసి ఓటిపి చెప్పాలని అధికారులు సూచిస్తున్నారు ఇలా చేస్తే బోర్డర్స్ రేషన్ కార్డులు ఉంటే బయటపడతాయని ప్రభుత్వ ఉద్దేశం. ఒకవేళ పంపిణీ కాకుండా ఉన్న రేషన్ కార్డులను స్థానిక తాసిల్దార్ కార్యాలయాల్లో అప్పగించాలని అధికారులు ఆదేశం కూడా ఇచ్చినట్లు సమాచారం. ఈనెల 30 తర్వాత కార్డులను వెనక్కి పంపిస్తామని అప్పుడు ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు. స్మార్ట్ రేషన్ కార్డులు ఈ కేవైసీ చేయించుకోకపోతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందజేసే సంక్షేమ పథకాలకు రేషన్ కార్డు ఆధారం కాబట్టి భవిష్యత్తులో పథకాలు నిలిపివేస్తారన్నది సమాచారం. ముఖ్యంగా కార్డులో చిన్న పిల్లలు ఉంటే వారి వేలిముద్రలను నమోదు చేయాలనుకుంటున్నారు. అదేవిధంగా కుటుంబ సభ్యుల్లో ఎవరైనా చనిపోతే వారి పేర్లను కార్డు నుంచి తప్పనిసరిగా తొలగించుకోవాలని సూచిస్తున్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు