వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్‌కు దరఖాస్తుల ఆహ్వానం
2026–2027 సంవత్సరా లకు అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియ
జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ కలెక్టర్ కీర్తి చేకూరి
విశాలాంధ్ర – తూర్పుగోదావరి : తూర్పు గోదావరి జిల్లాలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులు 2026–2027 రెండేళ్ల కాలపరిమితికి సంబంధించిన సమాచార–పౌర సంబంధాల శాఖ అక్రిడిటేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో జారీ చేసిన కార్డుల గడువు నవంబర్ 30తో ముగియనున్నందున నూతన అక్రిడిటేషన్ల జారీ ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. అర్హత కలిగిన జర్నలిస్టులు https://mediarelations.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. స్థానిక మీడియా సంస్థలు తమ వివరాలు పోర్టల్‌లో అప్డేట్ చేసిన తర్వాతే జర్నలిస్టులు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం . జిల్లా దినపత్రికలు, పీరియాడికల్స్ మరియు కేబుల్ ఛానల్ యాజమాన్యాలు తమ సంస్థలకు సంబంధించిన అవసరమైన పత్రాలను పెన్‌డ్రైవ్‌లో పొందుపరిచి, ఒక సెట్ జిరాక్స్ కాపీలతో కలిసి రాజమహేంద్రవరం జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కార్యాలయానికి అందజేయాలని సూచించారు.(బొమ్మూరు లో ఉదయం 10.30 నుంచి సా 5 గంటల లోగా) స్థానిక మీడియా సంస్థల వివరాలు పోర్టల్‌లో నమోదు అయిన అనంతరం మాత్రమే జర్నలిస్టులు ఆన్లైన్ దరఖాస్తులు చేయాలని కలెక్టర్ సూచించారు. సాటిలైట్ చానల్స్, పెద్ద పత్రికలు నేరుగా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు.
*స్థానిక మీడియా సంస్థలు సమర్పించవలసిన పత్రాలు* :
1. దినపత్రికలు/పత్రికలకు PRGI రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్
2. ABC / ప్రెస్ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా ఎంప్యానెల్డ్ CA సర్టిఫికేట్ (దినపత్రికలు/పత్రికలకు)
3. సంస్థ PAN కార్డు, గత 2 సంవత్సరాల IT రిటర్న్స్ (న్యూస్ ఏజెన్సీలకు)
4. PRGI కి సమర్పించిన తాజా వార్షిక రిటర్న్స్ (దినపత్రికలు, పీరియాడికల్స్)
5. ముద్రిత/అమ్ముడు కాపీల ప్రచురణకర్త సర్టిఫికేట్ (దినపత్రికలు, పీరియాడికల్స్)
6. కేబుల్ టీవీ నెట్వర్క్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ / A.P. ఫైబర్‌నెట్ అధికార లేఖ (కేబుల్ ఛానల్స్)
7. షాప్స్ & ఎస్టాబ్లిష్మెంట్స్ చట్టం / కంపెనీస్ చట్టం కింద రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (న్యూస్ ఏజెన్సీలు)
పై పత్రాలను సమర్పించిన అనంతరం అర్హత కలిగిన జర్నలిస్టులు త్వరితగతిన ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.


