విశాలాంధ్ర , కళ్యాణదుర్గం… కళ్యాణదుర్గం పట్టణంలోని బళ్లారి రోడ్డులో న్యాయవాది కోట్రేష్ పై జరిగిన దాడిని నిష్పక్షపాతంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని స్థానిక బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పార్థసారథి చౌదరి డిమాండ్ చేశారు. ఈ మేరకు డిఎస్పి రవిబాబును కలసి వినతి పత్రం అందజేశారు . బళ్లారి కి చెందిన న్యాయవాది కళ్యాణదుర్గం రావడంతో కొందరు దాడి చేశారని వారు చెప్పారు. దాడికి పాల్పడిన వారిని గుర్తించి కేసు నమోదు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ నివాసులు ఉపాధ్యక్షుడు రామాంజనేయులు హరి చక్రవర్తి పట్టాభి రవికుమార్ రామాంజనేయులు బాలాజీ ఎర్ర స్వామి తులసినాయక్ తదితరులు పాల్గొన్నారు.


