మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ తల్లం నారాయణమూర్తి
విశాలాంధ్ర ధర్మవరం;; గర్భిణీ స్త్రీలు ఆరోగ్యం పట్ల తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ నారాయణమూర్తి, సంస్థ అధ్యక్షులు జగ్గా వేణుగోపాల్ ,మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రియాంక తెలిపారు. ఈ సందర్భంగా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ కమిటీ వారు కొత్తపేటలోని అర్బన్ హెల్త్ సెంటర్లో 50 మంది గర్భిణీ స్త్రీలకు పళ్ళను పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి దాతగా దాసరి వెంకటేశులు (చిట్టి) వ్యవహరించడం పట్ల వారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం దాత మాట్లాడుతూ గర్భిణీలు ప్రశాంతంగా మనసును కలిగి ఉండాలని పౌష్టిక ఆహారం తీసుకోవాలని తెలిపారు. అప్పుడే సంపూర్ణమైన ఆరోగ్యం లభిస్తుందని తెలిపారు. సకాలంలో పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. గర్భిణీలు ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవం పొందాలని, గర్భిణీలకు బాలింతలకు ప్రభుత్వము ఇచ్చే సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఉపాధ్యక్షులు మంజునాథ్, సభ్యులు చిన్నప్ప, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
గర్భిణీలు ఆరోగ్యం పట్ల తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి..
- Advertisement -
RELATED ARTICLES


