Homeజిల్లాలుశ్రీ సత్యసాయితాగునీటి కోసం మహిళలు ఖాళీ బిందెలతో నిరసన

తాగునీటి కోసం మహిళలు ఖాళీ బిందెలతో నిరసన

- Advertisement -

విశాలాంధ్ర-చిలమత్తూరు ( శ్రీ సత్యసాయి జిల్లా): మండల పరిధిలోని టేకులోడు పంచాయితీ గ్రామంలో గురువారం ఎస్సీ కాలనీ మహిళలు త్రాగునీరు కోసం కాళీ బిందెలతో సచివాలయం ముట్టడించారు, ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ గత మూడు నెలల ముందు ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శి శ్రీనివాసరావు గ్రామానికి విచ్చేయగా రోడ్డుపై బైఠాయించాము, విషయం అర్థం చేసుకుని త్వరలో బోరుబావి త్రవ్వించారు, అయితే త్రాగునీటి కష్టాలు తీరాయి అనుకుంటే వాటిని అలానే వదిలేసి మరల ఎస్సీ కాలనీవాసులతో సచివాలయం ముందు బయటాయించి నినాదాలు చేసేల చేశారన్నారు, వెంటనే విషయం తెలుసుకున్న ఎంపీడీవో హరికృష్ణ బాలాజీ, డిప్యూటీ ఎంపీడీవో భాస్కర్, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మహిళల ఆవేదన అర్థం చేసుకొని ఎస్సీ కాలనీకి సజావుగా నీరు వచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో కాలనీ మహిళలు వెను తిరిగారు, ఏది ఏమైనాప్పటికీ రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని కాలనీకి నీరు వచ్చే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సంబంధిత అధికారులకు, ప్రజా ప్రతినిధులకు ఆదేశించారు, ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి మారుతి, సచివాలయ సిబ్బంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు