విశాలాంధ్ర -ధర్మవరం; డిసెంబర్ 28వ తేదీ మడకశిరలో జరిగిన ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యుటిఎఫ్ నాలుగవ జిల్లా కౌన్సిల్ నందు జిల్లా నూతన కమిటీని ఎన్నికల అధికారులు ఎస్ఎస్ నాయుడు , శెట్టిపి జయ చంద్రా రెడ్డి ప్రకటించారు.ఇందులో పట్టణానికి చెందిన ఆర్. రామకృష్ణ నాయక్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా, పి. అమర్ నారాయణరెడ్డి జిల్లా కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.వీరితోపాటు మహిళా జిల్లా కార్యదర్శిగా సి. నాగేంద్రమ్మ ,రాష్ట్ర కౌన్సిలర్ గా మేరీ వర కుమారి, జిల్లా అడిట్ కమిటీ సభ్యులుగా ఎం. ఆదినారాయణ ,జింక హరికృష్ణ , జిల్లా సిపిఎస్ సబ్ కమిటీ కన్వీనర్ గా బిల్లే రామాంజనేయులు, జిల్లా సాంస్కృతిక సబ్ కమిటీ కో కన్వీనర్ గా ఎం.ఆదిశేషు ,
జిల్లా మున్సిపల్ సబ్ కమిటీ కో కన్వీనర్ గా హెచ్. రామాంజనేయులు,
జిల్లా క్రీడా కమిటీ కో కన్వీనర్ గా వై. అమర్నాథ్ రెడ్డి, ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్. రామకృష్ణ నాయక్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పట్ల యుటిఎఫ్ పక్షాన రాజీ లేని పోరాటాలు కొనసాగిస్తామని కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి 12వ పి.ఆర్.సి కమిటీని నియమించాలని కమిటీ నియామకం ఆలస్యమైతే 30 శాతముతో మధ్యంతర భృతి ప్రకటిం.చాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తన ఎన్నికకు సహకరించిన యుటిఎఫ్ జిల్లా ,రాష్ట్ర , కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు
యుటిఎఫ్ జిల్లా కమిటీలో ధర్మవరం డివిజన్ కు సముచిత స్థానం
- Advertisement -
RELATED ARTICLES


