Homeజిల్లాలుఅనంతపురంవాహనం డ్రైవ్ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి

వాహనం డ్రైవ్ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి

- Advertisement -

-మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు

విశాలాంధ్ర-రాప్తాడు : రహదారులపై యువత వాహనాల్లో ప్రయాణించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు సూచించారు. జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాల్లో భాగంగా హంపాపురం సమీపంలోని శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల ఆధ్వర్యంలో యువతకు గురువారం
అనంతపురం నగరంలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ డి. శ్రీనివాసులు మాట్లాడుతూ దేశంలో రోజు రోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు నిర్లక్ష్య డ్రైవింగ్ ప్రధాన కారణమన్నారు. విద్యార్థులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించడం, సీటుబెల్ట్ వినియోగించడం, వాహనం నడుపుతూ మొబైల్ ఫోన్ ఉపయోగించకూడదని సూచించారు. ఈ నిబంధనలను పాటించడం ద్వారా ప్రమాదాల తీవ్రతను గణనీయంగా తగ్గించవచ్చన్నారు. అదేవిధంగా చెల్లుబాటయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండడం, వేగ పరిమితులను పాటించడం, రోడ్డు సంకేతాలను, సూచికలను అనుసరించే విధానంపై వివరించారు. కూడళ్ల వద్ద డ్రైవింగ్, ఓవర్‌టేకింగ్ సమయంలో జాగ్రత్తలు, రాత్రి సమయంలో వాహనాలను జాగ్రత్తగా నడపాలన్నారు. ప్రశ్నోత్తర కార్యక్రమం ద్వారా విద్యార్థులకు వాస్తవ జీవన పరిస్థితుల్లో ఎదురయ్యే ట్రాఫిక్ సమస్యలను నివృత్తి చేశారు. అనంతరం ఎం.వి.ఐ.ని విద్యార్థులు, కళాశాల సిబ్బంది
సన్మానించారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ వి.బి.ఆర్ శర్మ, చైర్మన్ బి. వి.కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ వెన్నెపూస రవీంద్రారెడ్డి, ఎం.డి వెన్నెపూస రమాకాంత్ రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ టి.విష్ణు వర్ధన్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎం.విజయభాస్కర్, 300 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు