విశాలాంధ్ర -అనంతపురం టౌన్; వై ద్య ఆరోగ్య శాఖ కార్యాలయము నందు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.ఈ.బి దేవి అధ్యక్షతన మాతా శిశు మరణాల సమీక్షా సమావేశాన్ని గురువారం నిర్వహించారు. ఈ సమావేశం లో జిల్లా వ్యాప్తంగా జరిగిన ఆరు శిశు మరణాలు మరియు రెండు మాతృ మరణాల పైన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డి యం హెచ్ మాట్లాడుతూ…. క్షేత్ర స్థాయిలో వైద్య సిబ్బంది మాతా శిశు సంరక్షణ పై తీసుకుంటున్న చర్యల పై ఆరా తీశారు. గర్భిణీ సేవలు ప్రసవానంతర సేవలలో అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని పేర్కొన్నారు. బాలింత సంరక్షణ లో వైద్య సిబ్బంది సేవలు అందించాలని తెలిపారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరుగుతున్న పరీక్షలపై ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వారీగా సంబంధిత అధికారులు సమావేశాలు జరపాలని పేర్కొన్నారు. గర్భవతిగా ఉన్న సమయంలో అందాల్సిన సేవలు మరియు ప్రసవానంతర సేవలపై క్షేత్రస్థాయి సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని మాతా శిశు మరణాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ సమావేశం లో .డా.డేవిడ్ సెల్వ రాజ్ డి సి హెచ్ ఎస్, డా.పద్మశ్రీ, గైనకాలజిస్ట్ డా.సోమ శేఖర్ అనస్తీసియా,డా
రాధిక పీడియాట్రిషన్, డా.నవీన్ కుమార్ పీడియాట్రిషన్ , డా.శశిభూషణ్ రెడ్డి డి ఐ ఒ, డా. శ్రీనివాస్ రెడ్డి డీపీఎం ఒ ,డా. విష్ణుమూర్తి , ప్రమీలా దేవి, హేమలత పాల్గొన్నారు.
మాత శిశు మరణాలపై సమీక్ష
- Advertisement -


