విశాలాంధ్ర-రాప్తాడు; మండలంలోని ఎం.బండమీదపల్లి గ్రామంలో శ్రీ కనకదాస విద్యా ఉపాధ్యాయ సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం సిమ్స్ హాస్పిటల్ వారి సౌజన్యంతో రోగులకు ఉచిత వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. ప్రముఖ గైనకాలజిస్ట్ క్యాన్సర్ డాక్టర్ పి.సునీత రోగులకు పరీక్షలు చేసి తగిన మందులు అందజేశారు. కనకదాస ఉపాధ్యాయ సేవా సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మర్రిస్వామి, సంజీవరాయుడు మాట్లాడుతూ ఆధునిక వైద్య సేవలను గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కూడా అందాలనే ఉద్దేశ్యంతో అన్ని రకాల జబ్బులకు వైద్య పరీక్షలు, గర్భకోశ క్యాన్సర్ వ్యాధికి చికిత్సలు
చేయించి ఉచితంగా మందులు పంపిణీ చేశామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ ఆర్ఉమాదేవి, ఎంపీటీసీ సూర్యనారాయణ, కనకదాసు ఉపాధ్యాయ సంఘం నాయకులు వీరనారప్ప, కమతం ఈశ్వరయ్య, అవిలిగొండ ఈశ్వరయ్య, నాగభూషణం, చిట్రా ఆదినారాయణ, స్టోర్ డీలర్ నారాయణస్వామి, మాజీ డీలర్ నాగరాజు నాగరాజు, వార్డ్ మెంబర్ వినోద్ కుమార్, పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
ఉచిత వైద్య శిబిరానికి అనూహ్య స్పందన
- Advertisement -
RELATED ARTICLES


