–పంచాయితీ అధికారిని గౌతమి
విశాలాంధ్ర- డుంబ్రిగుడ ( అల్లూరి జిల్లా): పరిసరాలు పరిశుభ్రతతోనే ఆరోగ్యమని పోతంగి పంచాయితీ కార్యదర్శి గౌతమి అన్నారు. మండల కేంద్రం డుంబ్రిగుడ లొ డ్రైనేజీలు తోపాటు పరిసరాలు చుట్టూ ఉన్నఇతర చెత్తచెదారాలను తొలగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడు ఎటువంటి జబ్బు జ్వరాలు రావని చెప్పారు. గ్రామంలో ఎటువంటి జబ్బు జ్వరాలు రాకుండా ఉండేందుకు నిత్యం పరిసరాలను పరిశుభ్రంగా చేయించడం జరుగుతుందన్నారు. ఈ విషయంలో గ్రామస్తులుకూడా వారి వారి యొక్క నివాస గృహాల పరిసరాలు చుట్టు పరిశుభ్రంగా ఉంచుకున్నట్లయితే ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. ప్రతి వీధిలో ఉన్న డ్రైనేజీతో పాటు పరిసరాలు ఉన్న చెత్తచెదారాలను తొలగిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


