Homeజిల్లాలుతూర్పు గోదావరిటివిసి ఛారిటబుల్ ట్రస్ట్ తరపున అగ్ని ప్రమాద బాధితులకు సాయం

టివిసి ఛారిటబుల్ ట్రస్ట్ తరపున అగ్ని ప్రమాద బాధితులకు సాయం

- Advertisement -

విశాలాంధ్ర – కడియం : కడియం మండలం, మురమండ గ్రామ పంచాయతీ, పశువుల హాస్పిటల్ సమీపంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన వికలాంగులు భీమన సూరిబాబు ఝాన్సీ ల కుటుంబాన్ని శనివారం ఉదయం వైసీపీ జిల్లా జనరల్ సెక్రటరీ, మండల జెసిఎస్ అధ్యక్షులు తాడాల విష్ణు చక్రవర్తి, ఆయన కుమారుడు తాడాల అర్జునరావు లు పరామర్శించారు. తమ టీవీసీ చారిటబుల్ ట్రస్ట్ తరఫున బాధితులకు 25 కెజి ల బియ్యం, కొత్త దుస్తులు, పదివేల రూపాయల నగదు అందజేశారు. ఈ సందర్భంగా చక్రవర్తి మాట్లాడుతూ నిరుపేదలు, వికలాంగులు అయిన బాధితుల ఇల్లు ఈ అగ్ని ప్రమాదంలో కాలి బూడిదవటం దురదృష్టకరమని, బాధితులు ధైర్యంగా ఉండాలని అన్నారు. భవిష్యత్తులో కూడా ఏ అవసరం వచ్చినా ఆదుకుంటానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం నుంచి సాయం అందేలా కృషి చేయాలని స్థానిక నాయకులకు విజ్ఞప్తి చేశారు. మంచి మనసుతో దాతలు, సంస్థలు సహాయం చేయడానికి ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మురమండ సర్పంచ్ అయినవిల్లి రుక్మిణి వెంకటేశ్వర్లు, ఉప సర్పంచ్ యర్రంశెట్టి వీరబాబు, కడియపు సావరం ఎంపిటిసి సాపిరెడ్డి దుర్గా కామేష్, బత్తిన శ్రీధర్, మేకా రామారావు, బలుకూరి వీరభద్ర రావు, బిళ్ళకుర్తి చిన్న, పోలోతు చంద్రరావు, నాగేశ్వరరావు, కోరా మణి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు