హైదరాబాద్ నాంపల్లిలోని ఓ ఫర్నిచర్ దుకాణంలో శనివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. బచ్చా క్రిస్టల్ ఫర్నిచర్ షాపు నాలుగు అంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో అగ్ని ప్రమాదం జరిగి మంటలు చెలరేగాయి.4 ఫైరింజన్ల సాయంతో మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఘటనాస్థలానికి భారీ క్రేన్లు చేరుకున్నాయి. భవనంలో ఆరుగురు ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. అందులో తల్లి, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు పేర్కొన్నారు. భవనం పరిసర ప్రాంతవాసులను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతుండడంతో స్థానికులు ఆందోళన దుతున్నారు.నాంపల్లి అగ్ని ప్రమాద ప్రాంతం వద్ద పోలీసులు, హైడ్రా, విపత్తు నిర్వహణ బృందం సహాయక చర్యలు చేపట్టింది. ఘటనాస్థలిలో అంబులెన్స్‌లను అధికారులు సిద్ధంగా ఉంచారు. భవనం చుట్టుపక్కల దట్టంగా పొగ అలుముకుంది. ప్రమాద తీవ్రతను పెంచే వస్తువులను స్థానికులతో కలిసి అధికారులు తొలగిస్తున్నారు.


