విశాలాంధ్ర – మండపేట : శ్రీయుత భారత ఎన్నికల సంఘం, న్యూఢిల్లీ, శ్రీయుత రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి, వెలగపూడి, ఆంధ్రప్రదేశ్, శ్రీయుత జిల్లా ఎన్నికల అధికారి మరియు కలక్టర్, డా. బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం మరియు శ్రీయుత జిల్లా ఎన్నికల అధికారి మరియు కలక్టర్, తూర్పు గోదావరి జిల్లా, రాజమహేంద్రవరం వారి ఆదేశములు ప్రకారం ది. 25.01.2026 వ తేదీన ఆదివారం నెం.48 మండపేట అసెంబ్లీ నియోజక వర్గంలోని మండపేట తహశీల్దార్ వారి కార్యాలయం నందు 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం కార్యక్రమములు ఘనంగా నిర్వహించడమైనది.
ఈరోజు 25.01.2026 వ తేదీన 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా మండపేట పట్టణంలోని పాటిమీద దుర్గమ్మ గుడి సెంటర్ నందు రాజకీయ పార్టీల ప్రతినిధులు, మారేడుబాక ప్రభుత్వ డిగ్రీ కళాశాలల విధ్యార్ధినీ విధ్యార్ధులు మరియు అధికారులు అందరూ కలిసి మానవహారంగా ఏర్పడి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారి అందరిచే సహాయ ఓటరు నమోదు అధికారి మరియు తహశీల్దార్, మండపేట వారు ఓటర్ల ప్రతిజ్ఞ చేయించి, అక్కడ నుండి తహశీల్దార్ వారి కార్యాలయం వరకూ ఈ సందర్భంగా ఓటు హక్కుకి ఉన్న విలువ గురించి నినాదములతో ర్యాలీ నిర్వహించి, అనంతరం మండపేట తహశీల్దారు వారి కార్యాలయంలో ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం అనియు, ఎన్నికల ప్రాభవాన్ని వివరించి, 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు పొండాలనియు, ఓటు ఉన్న ప్రతీ ఒక్కరూ కూడా ప్రతీ ఎన్నికలలో తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలనియు, ఓటర్లు అందరూ తమ ఓటు హక్కుని తమ జన్మ హక్కుగా భావించి, సదరు ఓటుని ఓటు కలిగిన ప్రతీ ఒక్కరూ ప్రతీ ఎన్నికలలో సద్వినియోగ పరుచుకోవాలని, ప్రజా స్వామ్యంలో ఓటు హక్కుకి ఉన్న ప్రాధాన్యత గురించి, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓటుహక్కుపై అవగాహన కల్పించేందుకు, అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామనియు, ఏటా జనవరి 25న ఓటర్ల దినోత్సవం నిర్వహిస్తున్నామని నెం.48 మండపేట అసెంబ్లీ నియోజక వర్గంలోని సహాయ ఓటరు నమోదు అధికారి మరియు తహశీల్దార్, మండపేట శ్రీ పి. తేజేశ్వరరావు వారు సభను ఉద్దేశించి ప్రసంగించినారు. మునిసిపల్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ శ్రీమతి కె.శ్రీ రమ్య, మండపేట డిప్యూటీ ఎం.పి.డి.,ఒ., శ్రీ శ్రీనివాసు మరియు జి.ఎస్.డబల్యూ.ఎస్. శ్రీ అనిల్ కుమార్ వారు దేశ, రాష్ట్ర, గ్రామాల అభివృద్ధి కోసం పనిచేసే ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు ఓటుగా వాడుకోవాలనియు పేర్కొన్నారు. ఎన్నికల డిప్యూటీ తహశీల్దార్ పి.ఎ.మెహర్ బాబా వారు 25.01.2026 కి గల నియోజక వర్గ ఓటర్ల ప్రగతి నివేదికలలో భాగంగా ప్రధానంగా మండపేట అసెంబ్లీ నియోజక వర్గంలో 06.01.2025 న ఫోటో ఓటర్ల జాబితా తుది ప్రచురణ ప్రకారం 223 పోలింగ్ స్టేషన్ లు కలవనియు, 1,07,175 మంది పురుషులు, 1,13,237 మంది స్త్రీలు 6 గురు ఇతరులు మొత్తం 2,20,418 మంది మరియు 67 మంది సర్వీస్ ఓటర్లు కలరనియు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లో భాగంగా ఈరోజుకి మొత్తం 2,20,587 ఓటర్లు ఉండగా, 1,1,7931 ఓటర్ల మ్యాపింగ్ చేయగా, 53.46% పూర్తి అయినదనియు, మండపేట అసెంబ్లీ నియోజక వర్గంలో నిత్యం 260 మంది ఎన్నికల సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారని సభకు చదివి వినిపించారు.
70 సం.రములు వయస్సు పైబడి ఉండి, ఎన్నికలలో ఎక్కువ సార్లు ఓటు హక్కు వినియోగించుకున్న ముగ్గురు సీనియర్ సిటిజన్ ఓటర్లను దుశ్శాలువాలతో, పూల మాలలతో పండ్లు ఇచ్చి ఘనంగా సత్కరించడం జరిగినది. కొత్తగా ఓటు నమోదు చేయించుకున్న 18-19 వయస్సు ఉన్న యువతీ యువకులకు ఓటరు గుర్తింపు కార్డులు జారీ చేసియున్నారు.
ఈ కార్యక్రమంలో నెం.48 మండపేట అసెంబ్లీ నియోజక వర్గంలోని సహాయ ఓటరు నమోదు అధికారి మరియు తహశీల్దార్, శ్రీ పి.తేజేశ్వరరావు, సహాయ ఓటరు నమోదు అధికారి మరియు మరియు మునిసిపాలిటీ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ శ్రీమతి కె. శ్రీరమ్య, మండపేట డిప్యూటీ ఎం.పి.డి.,ఒ., శ్రీ శ్రీనివాసు మరియు జి.ఎస్.డబల్యూ.ఎస్. శ్రీ అనిల్ కుమార్, తహశీల్దార్ వారి కార్యాలయపు సిబ్బంది, మునిసిపల్ కార్యాలయపు సిబ్బంది, బూత్ లెవెల్ అధికారులు, సూపర్ వైజర్లు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల లెక్చరర్లు, విధ్యార్ధినీ విధ్యార్ధులు తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం
- Advertisement -


