Homeజిల్లాలుతూర్పు గోదావరిఅగ్ని ప్రమాద బాధితులకు సాయం

అగ్ని ప్రమాద బాధితులకు సాయం

- Advertisement -

నిత్యావసర వస్తువులు అందజేసిన బాధ్యత సేవా సంస్థ అధ్యక్షులు గిరజాల బాబు

విశాలాంధ్ర – కడియం : కడియం మండలం, మురమండ గ్రామ పంచాయతీ, పశువుల హాస్పిటల్ సమీపంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన దివ్యాంగులు అయిన భీమన సూరిబాబు ఝాన్సీ ల కుటుంబాన్ని బాధ్యత సేవా సంస్థ అధ్యక్షులు వైస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గిరజాల బాబు, స్థానిక పార్టీ నాయకులు కలిసి పరామర్శించారు. బాధిత కుటుంబానికి నిత్యావసర వస్తువులు, బియ్యం, దుప్పట్లు, చీరలు, వంటసామగ్రి, నగదు అందజేశారు. ఈసందర్భంగా బాబు మాట్లాడుతూ నిరుపేదలు, కుటుంబం మొత్తం దివ్యాంగులైన అయిన బాధితుల ఇల్లు ఈ అగ్ని ప్రమాదంలో కాలి బూడిదవటం దురదృష్టకరమని, బాధితులకు పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి ఆదుకోవాలని అన్నారు. ఇప్పటికే ఈ విషయం తెలిసి ఆదుకున్న దాతలకు పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా పక్కా ఇల్లు నిర్మించేలా నాయకులందరూ కలిసికట్టుగా కృషి చేసి ప్రభుత్వానికి తెలపాలన్నారు. గత 25 సంవత్సరాలుగా కష్టాల్లో ఉన్న బాధితులకు తమ వంతుగా బాధ్యతా సంస్థ ఆదుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మురమండ సర్పంచ్ అయినవిల్లి రుక్మిణి వెంకటేశ్వర్లు, పున్నమి రాజు వీర్రాజు, శిరిగినీడి సత్యనారాయణ, బలుగూరి వీరభద్రరావు, బిళ్ళకుర్తి గంగాజలం, గుండుబోగుల సుబ్బారావు, మిద్దే సుబ్బారావు, అధికారి నాగేశ్వరావు, బత్తిన శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు