Homeజిల్లాలుప్రకాశంకార్మిక.. కర్షక.. బడుగుల పత్రిక విశాలాంధ్ర

కార్మిక.. కర్షక.. బడుగుల పత్రిక విశాలాంధ్ర

- Advertisement -

విశాలాంధ్ర జీఎం పి. హరినాధ రెడ్డి

విశాలాంధ్ర -ప్రకాశం: కార్మిక.. కర్షక.. బడుగుల పత్రిక విశాలాంధ్ర అని విశాలాంధ్ర జీఎం పి. హరినాధ రెడ్డి అన్నారు. ఒంగోలు విశాలాంధ్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని విశాలాంధ్ర డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల గొంతుగా ఈ పత్రిక నిలుస్తోందన్నారు. అన్యాయాలు, అక్రమాలను ప్రశ్నిస్తూ నిరంతరం అట్టడుగు వర్గాల అభ్యున్నతికి పనిచేస్తుందన్నారు. పాలకుల నిరంకుశత్వాన్ని అనుక్షణం నిలదీస్తూ తమ సమాజ స్థాపనకు పనిచేస్తున్న పత్రికగా విశాలాంధ్ర పాఠకుల, ప్రజల మన్ననలను అందుకుంటుందన్నారు. ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్న మొక్కవోని దీక్షగా ప్రజా సమస్యలను ప్రచురించడంలో వెనుకడుగు వేయడం లేదన్నారు. విశాలాంధ్ర పత్రికను ఆదరిస్తూ.. ప్రోత్సహిస్తున్న పాఠకులకు, ఉద్యోగ, కార్మిక, కర్షక వర్గానికి కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. కార్యక్రమంలో విశాలాంధ్ర ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ కూన అజయ్ బాబు, సీపీఐ జిల్లా కార్యదర్శి మన్నేపల్లి లక్ష్మీనారాయణ, విశాలాంధ్ర విజయవాడ ఎడిషన్ మేనేజర్ సాయిబాబా, ప్రకాశం జిల్లా బ్యూరో ఏ సురేష్ పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు