విశాలాంధ్ర – గుడిబండ..గుడిబండ మండలంలోని హిరేతూర్పి గ్రామంలో వెలిసిన శ్రీ ఆంజనేయస్వామి జాతర మహోత్సవం సందర్భంగా ఆదివారం నిర్వహించిన రథోత్సవ కార్యక్రమం భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. గ్రామస్తుల ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు వివిధ రాజకీయ పార్టీల నాయకులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ మూర్తి మాట్లాడుతూ, శ్రీ ఆంజనేయస్వామి జాతరను గ్రామ ప్రజలు కులమతాలకు అతీతంగా ఐక్యభావంతో నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. గ్రామంలో భక్తి వాతావరణం నెలకొనడం శుభ సూచకమని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సన్నీఈరప్ప, హెచ్. గొల్లహట్టి కసాపురం చిత్తయ్య తదితరులు పాల్గొన్నారు. గుడిబండ మండలంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారికి మొక్కులు చెల్లించారు.జాతర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు శాఖ కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసింది.కార్యక్రమంలో వైసీపీ, టీడీపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శ్రీ ఆంజనేయస్వామి జాతరలో ఘనంగా రథోత్సవం..
- Advertisement -
RELATED ARTICLES


