విశాలాంధ్ర–లేపాక్షి: జాతీయ ఓటరు దినోత్సవాన్ని లేపాక్షిలో ఆదివారం ఉదయం ఘనంగా నిర్వహించారు. జవహర్ నవోదయ విద్యాలయం విద్యార్థులు, ఉపాధ్యాయులు, మండల స్థాయి అధికారులు కలిసి పలు అవగాహన కార్యక్రమాలు చేపట్టారు.ఈ సందర్భంగా నవోదయ విద్యార్థులు, అధికారులు విద్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరి ప్రసిద్ధ నంది విగ్రహం వరకు పాదయాత్ర నిర్వహించారు. ఓటు హక్కు ప్రాధాన్యత, ఓటు దుర్వినియోగం వల్ల కలిగే అనర్థాలపై నినాదాలతో ప్రజలకు అవగాహన కల్పించారు.అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధికారులు కలిసి మానవహారం ఏర్పాటు చేశారు. జాతీయ ఓటరు దినోత్సవం ఉద్దేశ్యం, ప్రజాస్వామ్యంలో ఓటు విలువపై పలువురు అధికారులు వివరించారు. తరువాత తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో వివిధ పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు, అధికారులు, బూత్ లెవల్ ఆఫీసర్ లు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సౌజన్యలక్ష్మి, ఎంపీడీవో శ్రీనివాసులు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
లేపాక్షిలో ఘనంగా జాతీయ ఓటరు దినోత్సవం..
- Advertisement -
RELATED ARTICLES


