Homeజిల్లాలుతూర్పు గోదావరిఎమ్మెల్సీ నాగబాబుతో గెడ్డం శివ రత్న గణపతి భేటీ

ఎమ్మెల్సీ నాగబాబుతో గెడ్డం శివ రత్న గణపతి భేటీ

- Advertisement -

విశాలాంధ్ర – కడియం : ఎచ్చెర్ల నియోజకవర్గంలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న జనసేన ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబును కడియం మండలం బుర్రిలంక చిరు సేవా సమితి అధ్యక్షులు మరియు జనసేన పార్టీ జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షులు గెడ్డం శివ రత్న గణపతి మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చిరు సేవా సమితి 25 సంవత్సరాల సేవా ప్రస్థానంలో ఇటీవల ఘనంగా నిర్వహించిన సిల్వర్ జూబ్లీ వేడుకల వివరాలను నాగబాబుకు తెలియజేశారు. వేడుకల సందర్భంగా రూపొందించిన ఆల్బమ్‌ను నాగబాబు ఆసక్తిగా తిలకించారు. చిరు సేవా సమితికి ఆతిథ్యం ఇచ్చిన నాగబాబు, 25 ఏళ్లుగా నిస్వార్థంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వేలాదిమందికి రక్తదానం చేస్తున్న శివ సేవలను ప్రశంసించారు. సిల్వర్ జూబ్లీ వేడుకలు విజయవంతంగా నిర్వహించినందుకు అభినందనలు తెలిపారు. భవిష్యత్‌లో తప్పక ఒక సేవా కార్యక్రమానికి హాజరవుతానని హామీ ఇచ్చారు. అలాగే, జనసేన పార్టీని మరింత బలోపేతం చేయడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై శివతో చర్చించి పలు సూచనలు చేశారు. చిరు సేవా సమితి ద్వారా చేపడుతున్న సేవా కార్యక్రమాలకు ఎప్పుడైనా తన సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చిరు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు