విశాలాంధ్ర- డుంబ్రిగుడ ( అల్లూరి జిల్లా): రిపబ్లిక్ డే దినోత్సవం పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ చేతులు మీదుగా ఉత్తమ విద్యాశాఖ అధికారిగా ఎస్ సుందర్ రావు అవార్డు అందుకున్నారు. ఉత్తమ విద్యాశాఖ అధికారిగా అవార్డు అందుకోవడంతో పి ఆర్ టి యు నాయకులు ఆయనకు పూల బొకేలు అందించి ఘనంగా దుస్సాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా పిఆర్టియు నాయకులు మాట్లాడుతూ ఆయన అందించిన సేవలను జిల్లా స్థాయి అధికారులు గుర్తించి ఆయనకు అవార్డు అందించడం అభినందనీయం అన్నారు. అనంతరం మండల విద్యాశాఖ అధికారి సుందర్రావు మాట్లాడుతూ అందరి సహకారం వల్ల ఈ గుర్తు లభించిందని అందుకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఆర్టియు నాయకులు తదితరులు పాల్గొన్నారు
విద్యాశాఖ అధికారికి ఘన సత్కారం..
- Advertisement -
RELATED ARTICLES


