తాత లింగం చంద్రశేఖర్
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని గాంధీ నగర్ లో గల 18వ వార్డులోని ప్రభుత్వ మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీటిని సేవించేందుకుగాను దాతలు తాత లింగం చంద్రశేఖర్ ఆధ్వర్యంలో తల్లిదండ్రులైన అభిలాష్, శ్రావణి కుమారుడు సంవేద్ ప్రధమ జన్మదిన వేడుకల సందర్భంగా రెండు వాటర్ ఫిల్టర్ లను (విలువ 25, 000రూ.లు) దాతల చేతుల మీదుగా హెడ్మాస్టర్ రాజకుమారుకు అందజేశారు. ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ మా మనవడు సంవేద్ పుట్టినరోజు సందర్భంగా ఇటువంటి వేడుకను తాము నిర్వహించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని, నాతో పాటు నా కుటుంబ సభ్యులు కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివి ఉన్నతమైన స్థితికి చేరడం జరిగిందని తెలిపారు. అనంతరం హెడ్మాస్టర్ రాజకుమార్ దాతలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బాబ్జి తో పాటు దాత కుటుంబ సభ్యులు హర్షవర్ధన్, దేవి ప్రియ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు రెండు వాటర్ ఫిల్టర్ బహుకరణ..
- Advertisement -
RELATED ARTICLES


