కొవ్వూరు నియోజకవర్గ జనసేన ఇంచార్జి టివిఆర్ చురక
విశాలాంధ్ర – తాళ్లపూడి: రాష్ట్రం లో ఎన్డీయే కూటమి లో జనసేన భాగస్వామ్యం అయినప్పటికీ, కొవ్వూరు నియోజకవర్గం లో మాత్రం జనసేన పార్టీ కి గౌరవం, ఆ హక్కు దక్కడం లేదని, మెడికల్ రీ-ఎంబెర్స్మెంట్ కి కూడా టీడీపీ ని ముష్టి ఎత్తుకోవాల్సిన పరిస్థితుల్లో జనసైనికులున్నారని, ఇబ్బందులుంటే బయ(ట)పడకండి, నేరుగా మంగళగిరి కార్యాలయాని కి తేలియ చేద్దాం అని కొవ్వూరు నియోజకవర్గ జనసేన ఇంచార్జి టివిరామారావు పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వ పరిపాలనలో భాగస్వామ్యంగా ఉన్న జనసైనికుల మాట కూడా ప్రభుత్వ అధికారులు పరిగణ లోకి తీసుకోవాల్సిన అవసరం వుందని, టీడీపీ వాళ్ళు చెప్పారనో మరెవరో చెప్పారనో వ్యవహరిస్తే డిప్యూటీ ముఖ్యమంత్రి దృష్టికి, పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్తుందని టివిఆర్ సున్నితంగా హెచ్చరించారు. మండల కేంద్రమైన తాళ్లపూడి లో జనసేన మండల సమావేశం జరిగింది. ఇటీవల సంక్రాంతి సందర్బంగా సాంప్రదాయం గా వేసే కొడిపంధాల నిర్వహణ లో జనసైనికులని అధికారులు ఇబ్బంది పెట్టిన విషయమే దీనికి తార్కాణం అన్నారు. తాళ్లపూడి మండలం లో జనసేన నాయకత్వ ఇబ్బంది లేకుండా ఐదుగురు వ్యక్తులతో ఒక తాత్కాలిక కమిటీ ని వేసి జనసేనను ముందుకు నడిపిస్తానని ఆయన పేర్కొన్నారు. తాళ్లపూడి మండలం లోని పలుగ్రామల జనసైనికులు పాల్గొన్నారు.


