Homeజిల్లాలుశ్రీ సత్యసాయిసిడిపిఓ గా జయంతి పదవీ బాధ్యతలు స్వీకరణ

సిడిపిఓ గా జయంతి పదవీ బాధ్యతలు స్వీకరణ

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం;; ధర్మవరం ఐసిడిఎస్ విభాగానికి సిడిపిఓ గా జయంతి పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఇక్కడ పనిచేస్తున్న లక్ష్మీని సోమందేపల్లి ఏసీ డిపిఓగా జిల్లా కలెక్టర్ బదిలీ చేశారు. అదేవిధంగా ధర్మవరం ఐసిడిఎస్ కార్యాలయంలో బ్లాక్ కోఆర్డినేటర్ గా పనిచేస్తున్న నరేందర్ రెడ్డిని నల్లచెరువుకు బదిలీ చేశారు. ఐసిడిఎస్ శాఖలో కొన్ని వ్యవహారాల పైన ఆరోపణలు రాగా జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఆకస్మికంగా ఇరువురిని బదిలీ చేశారు. ఈ బదిలీని ఐసిడిఎస్ పీడీ ప్రమీల ధ్రువీకరించి బదిలీ పత్రాలను అందజేశారు. అనంతరం నూతన సిడిపిఓ జయంతి మాట్లాడుతూ ఐసిడిఎస్ విభాగాన్ని అభివృద్ధి బాటలో నడుపుతూ అందరి సహాయ సహకారంలో మంచి గుర్తింపు వచ్చేలా కృషి చేస్తారని తెలిపారు. తదుపరి ధర్మవరం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ పరిటాల శ్రీరాములును గౌరవపూర్వకంగా కలిశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు