Homeజిల్లాలుశ్రీ సత్యసాయిరైతు పంటకు గిట్టుబాటు ధరే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యం

రైతు పంటకు గిట్టుబాటు ధరే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యం

- Advertisement -

–మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు

విశాలాంధ్ర ధర్మవరం;; రైతు పంటకు గిట్టుబాటు ధరే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం లక్ష్యము అని మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని మార్కెట్ యార్డును మంత్రి ఆదేశాల మేరకు ఆకస్మికతనికి నిర్వహించారు.ఈ సందర్భంగా మార్కెట్ యార్డ్‌లో ఉన్న రైతులతో నేరుగా మాట్లాడిన హరీష్ బాబు, కందుల కొనుగోలు ప్రక్రియ, మద్దతు ధర అమలు, తూకం విధానం, రవాణా తదితర అంశాలపై సమగ్రంగా వివరాలు తెలుసుకున్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను శ్రద్ధగా విన్న అనంతరం, ఎలాంటి అవకతవకలు లేకుండా, ప్రభుత్వ నిబంధనల ప్రకారం పూర్తిగా పారదర్శకంగా కొనుగోలు ప్రక్రియ జరగాలని సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రైతులు తమ పంటను విక్రయించడంలో ఎలాంటి ఇబ్బందులు పడకుండా, తూకంలో న్యాయం జరిగేలా చూడాలని, అలాగే మద్దతు ధర పూర్తిస్థాయిలో అమలవ్వాలని హరీష్ బాబు అధికారులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ నాయకులు పాల్గొన్నారు.

పూరీలో ఆపదలో చిక్కుకున్న ధర్మవరం కుటుంబానికి మంత్రి సత్య కుమార్ యాదవ్ అండ;; ప్రజల పట్ల తనకున్న బాధ్యత మానవీయ దృక్పథాన్ని ఆరోగ్య శాఖ మంత్రి శతకుమార్ యాదవ్ మరోసారి నిరూపించారు. రాష్ట్ర కేబినెట్ సమావేశంలో పాల్గొంటున్న సమయంలో తన నియోజకవర్గానికి చెందిన ప్రజలు ఆపదలో ఉన్నారు అన్న విషయాన్ని తెలుసుకొని వెంటనే ధర్మవరం పట్టణానికి చెందిన శారద నగర్ వీధిలోని లక్ష్మీదేవి కుటుంబం పూరి జగన్నాథ్ టెంపుల్ దర్శనానికి వెళ్లిన సందర్భంగా అక్కడ అనుకోకుండా ప్రమాదంలో తీసుకెళ్లిన లగేజ్ మొత్తాన్ని కోల్పోవడం జరిగింది. రెండు రోజులు పాటు రైల్వేస్టేషన్లోనే ఉండి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అనంతరం మంత్రి దృష్టికి తీసుకొని రాగా తన పరిచయస్తులను తక్షణమే రంగంలోకి దింపి బాధిత కుటుంబానికి అవసరమైన ట్రైన్ టికెట్లు ప్రయాణ ఖర్చులు తాత్కాలిక వసతిని కల్పించారు. అధికార హోదా కంటే మానవత్వమే తనకు ముఖ్యమని మంత్రి మరోసారి నిరూపించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలు మంత్రికి శుభాకాంక్షలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు