Homeజిల్లాలుఏలూరువిద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలి

విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలి

- Advertisement -

కేంద్ర సమాచార కమిషనర్ సుధారాణి

      విశాలాంధ్ర ఏలూరు:కష్టంతో కాకుండా ఇష్టంతో చదివి ఉన్నత లక్ష్యాలు సాధించాలని కేంద్ర సమాచార కమీషనర్ సుధారాణి రేలంగి విద్యార్థినులకు ఉద్బోధించారు.  స్థానిక సెయింట్ థెరెసా మహిళా కళాశాలలో శనివారం జరిగిన కళాశాల  73వ వార్షికోత్సవ కార్యక్రమంలో కేంద్ర సమాచార కమీషనర్ సుధారాణి రేలంగి   ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు.  ఈ సందర్భంగా సుధారాణి రేలంగి మాట్లాడుతూ విద్యతోనే అభివృద్ధి సాధ్యమని, ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవడంతోపాటు వాటిని  కృషి, పట్టుదలతో సాధించుకోవాలన్నారు.  లక్ష్యాలను సాధించుకునే దశలో విద్యార్థినులకు అవసరమైన సూచనలు అందిస్తానని, విద్యార్థినులకు ఫోన్లో అందుబాటులో ఉంటానని, లేదా నేరుగా తనను ఎప్పుడైనా  కలవవచ్చన్నారు.ఈ సందర్భంగా కళాశాలలో ఉత్తమ ప్రతిభ కనపరచిన విద్యార్థినులకు ప్రశంసా పత్రాలు అందించారు. ఉత్తమ బోధన చేసిన అధ్యాపకులను దుశ్శాలువాతో సత్కరించారు.  ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం కేంద్ర సమాచార కమీషనర్ సుధారాణి రేలంగి ని, రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్ చైర్ పర్సన్ కె.రత్నశీలామణి లను దుశ్శాలువా, జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సిస్టర్ మెర్సీ,కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, కళాశాల విద్యార్థినులు పాల్గొన్నారు.
RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు