Homeజిల్లాలుపశ్చిమ గోదావరితిరుమల లడ్డూను రాజకీయాలకు వాడుకోవడం దుర్మార్గం

తిరుమల లడ్డూను రాజకీయాలకు వాడుకోవడం దుర్మార్గం

- Advertisement -

కర్రా జయ సరిత

విశాలాంధ్ర – పాలకొల్లు:పాలకొల్లు పట్టణంలో పాలకొల్లు నియోజక ఇంఛార్జి గుడాల శ్రీహరి గోపాల రావు ఆధ్వర్యంలో గతంలో ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదం లో కల్తీ నెయ్యి కలిపారంటూ మాజీ ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి పై కూటమి ప్రభుత్వం చేసిన దుష్ప్రచారం పై.. సీబీఐ ఇచ్చిన నివేదిక గొడ్డలి పెట్టు వంటిదని వైసీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ గుడాల శ్రీహరి గోపాలరావు అన్నారు. తిరుమల తిరుపతి లడ్డు లో కల్తీ నెయ్యి కలప లేదని కోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిన నేపద్యంలో పాలకొల్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సిఎం దుష్ప్రచారానికి వ్యతిరేకంగా పాలకొల్లు పట్టణంలోని కెనాల్ రోడ్డులో వేంచేసియున్న శ్రీభూనీలా సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో పాప పరిహార పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్య క్రమంలో పాలకొల్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజక వర్గ ఇంచార్జ్ గుడాల శ్రీహరి గోపాల రావుతో కలిసి కార్యక్రమంలో న్యాయ వాది, వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం స్టేట్ ప్రధాన కార్యదర్శి, కాకినాడ జిల్లా మహిళా విభాగం ఇంఛార్జి కర్రా జయ సరిత పాల్గొన్నారు. జయసరిత మాట్లాడుతూ భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా పవిత్రమైన తిరుపతిలో లడ్డూను రాజకీయాలకు వాడుకోవడం దుర్మార్గమైన చర్య అన్నారు. వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు