– జేఎన్ టి యు వి. సి. ఆచార్య సుదర్శన్ రావు
విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: గమ్యానికి చేరి.. అడుగు ప్రయాణంలో అతివేగం ప్రమాదకరం.. జీవితాన్ని పణంగా పెట్టవద్దు అని వీసీ ఆచార్య హెచ్ సుదర్శన్ రావు పేర్కొన్నారు. జె.ఎన్.టి.యూ. అనంతపురము విశ్వవిద్యాలయంలో కళాశాల ఆడిటోరియం లో నెల రోజుల పాటు జరిగిన జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు శనివారం ముగిశాయి. ఉపకులపతి మాట్లాడుతూ . ప్రతి ఒక్కరు రహదారి నియమావళి పాటించితే ప్రమాదాలు చాలా వరకు తగ్గే అవకాశముందని తెలిపారు. వాహనములు నడిపేటప్పుడు మొబైల్ పోన్ లో మాట్లాడడం చేయరాదని, ట్రిపుల్ రైడింగ్ వెళ్లరాదని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, ప్రతి ఒక్కరు సీటు బెల్టు ను ధరించాలని, స్కూల్లు, కాలేజీల దగ్గర వేగాన్ని తగ్గించి వాహనాలను నడపాలని తెలిపారు. ఉపకులపతి విద్యార్థులు , అధ్యాపకుల అందరితో రోడ్డు ప్రమాదాలు నివారించడానికి స్పూర్తిదాయకంగా ప్రతిజ్ఞ చేయించారు.వీర్రాజు , డిప్యూటి ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ అనంతపురము మాట్లాడుతూ ..వాహనాలు నడిపేటప్పుడు ముఖ్యంగా ట్రాఫిక్ సిగ్నల్స్ ను పాటించాలని, హెల్మెట్ ను తప్పని సరిగా ధరించాలని, వ్యతి రేక దిశల ప్రయాణం చేయకూడదని ఆయన సూచనలు ఇచ్చారు. మద్యం సేవించి వాహనం నడిపిన యెడల మోటర్ వాహన చట్టం 185 సెక్షన్ ప్రకారం 6 నెలల వరకు జైలు శిక్ష విధించబడుతుందని తెలిపారు. ముఖ్యంగా భావి భారత పౌరులైన విద్యార్థులు దేశానికి మాణిక్యాలని, వాహనములను నడిపేటప్పుడు తప్పని సరిగా హెల్మెట్ ధరించాలని తెలిపారు. ఆర్ టి ఓ సురేష్ నాయుడు మాట్లాడుతూ అతివేగం ప్రమాదాలకి ముఖ్య కారణమని, ప్రతి ఒక్కరు రహదారి నియమావళి పాటించితే ప్రమాదాలు చాలా వరకు తగ్గే అవకాశముందని తెలిపారు వేగం కన్నా ప్రాణం ముఖ్యమని, ప్రాణం ఎంతో విలువైనదని తెలిపారు. రహదారి భద్రత కేవలం నినాదం కారాదు, అది మన జీవన విధానం కావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య పి. చెన్నారెడ్డి , వైస్ ప్రిన్సిపాల్ ఆచార్య దిలీప్ కుమా , ఆచార్య కె. మాధవి , రోడ్డు భద్రతా సిబ్బంది శ్రీ మనోహర్ రెడ్డి , (మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ) సునీత , సునీల్ , కుమారి లహరి , భోధన, భోధనేతర సిబ్బంది, రోడ్డు భద్రత సిబ్బంది పాల్గొన్నారు.


