Homeజిల్లాలుఅల్లూరి సీతారామ రాజుఅరకు అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట

అరకు అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట

- Advertisement -

ఉత్తరాంధ్రలో డోలి రహిత గ్రామాలు:మంత్రి గుమ్మడి సంధ్యారాణి

విశాలాంధ్ర – డుంబ్రిగుడ : గిరిజన ప్రాంతాల అభివృద్ధి పర్యటక రంగ విస్తరణ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని జిల్లా ఇన్చార్జి మంత్రి, శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు గుమ్మడి సంధ్యారాణి చెప్పారు. అరకు ఉత్సవాలు ముగింపు సందర్భంగా ఆదివారం అరకు ఫై నరిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. అరకు సంస్కృతిని, కళాలను ప్రపంచవ్యాప్తం చేసేందుకు అరకు మండలం చంపి గ్రామంలో 2 ఎకరాల్లో అరకు ఆర్ట్ విలేజ్ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్లు, ప్రముఖ ఆర్కిటెక్లు సలహాలతో రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్టును ఈ ఏడాది ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా ప్రారంభించేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న కవులు, కళాకారులకు గొప్ప వేదికగా నిలుస్తుందని ఆస భావం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్రలోని ఏడు ఏజెన్సీ నియోజకవర్గాలలో ప్రజల రవణ ఇబ్బందులను తొలగించి డోలి రహిత గ్రామాలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 500 కోట్ల రూపాయలతో గ్రామాలకు రోడ్లు అనుసంధాన కార్యక్రమం చేపడుతున్నామని, ఇందుకు సహకరించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఆమె ధన్యవాదాలు తెలిపారు. అరకు కాఫీకి సాటిగా స్థానిక చిరుధాన్యాలతో తయారుచేసిన అరకు కౌన్, అరకు తాళి లను పర్యటకులకు పరిచయం చేస్తున్నమన్నారు. పర్యటక రంగం ద్వారా యువతకు ఉపాధి కల్పించేందుకు క్యారవన్ టూరిజం, ఓం స్టే టూరిజం, అడ్వెంచర్ పార్కులు రిసార్టులను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, రంపచోడవరం ఎమ్మెల్యే శిరీష దేవి, జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్, ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీ పూజ, అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్ ఆయా శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు