విశాలాంధ్ర ధర్మవరం;; రాష్ట్రస్థాయి షూటింగ్ బాల్కు రిషి విద్యాలయ పాఠశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు ఎంపిక కావడం జరిగిందని పాఠశాల డీన్ భాస్కర్ రెడ్డి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ పట్టణంలోని కాలేజ్ గ్రౌండ్‌లో సబ్ జూనియర్ షూటింగ్ బాల్ పోటీలు నిర్వహించారు అని,ఈ పోటీలకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి సుమారు 80 మంది క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు అని తెలిపారు.ఉత్కంఠభరితంగా సాగిన పోటీల అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేశారన్నారు. ఈ ఎంపికల్లో రిషి విద్యాలయ నుంచి 7వ తరగతికి చెందిన కె. ధర్మేంద్ర రెడ్డి, పి. షణ్ముఖ్ కుమార్ రెడ్డి, ఎం. ధరణేష్ రెడ్డి, సిరి ఎస్.వి, దక్షా ఎల్, ఏ. హర్షిత రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక అయ్యినoదుకు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటి విజయాలు రిషి విద్యాలయ మరెన్నో సాధిస్తుందని తెలిపారు .ఈ సందర్భంగా సి ఏ ఓ రవీంద్ర మాట్లాడుతూ, విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి క్రీడలు ఎంతో అవసరమని, చదువుతో పాటు ఆటల్లోనూ విద్యార్థులు రాణించేలా రిషి విద్యాలయ నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు.ప్రిన్సిపల్ కరణ్ స్వరూప సింగ్ మాట్లాడుతూ, క్రీడల్లో పాల్గొనడం వల్ల శారీరక దృఢత్వంతో పాటు మానసిక స్థైర్యం పెరుగుతుందని అన్నారు.
వైస్ ప్రిన్సిపల్ కళ్యాణి మాట్లాడుతూ, క్రీడాకారులు క్రమశిక్షణతో, పట్టుదలతో సాధన చేస్తే రాష్ట్ర స్థాయిలో మంచి విజయాలు సాధిస్తారని తెలిపారు.
ఈ సందర్భంగా ఏఓ రంగారెడ్డి , ఉపాధ్యాయులు, పి ఇ టి గణేశ్ ను ఎంపికైన విద్యార్థులను అభినందిస్తూ, రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని “ఆల్ ది బెస్ట్” తెలిపారు.
రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్కు రిషి విద్యాలయ పాఠశాల ఆరుగురు విద్యార్థులు ఎంపిక
- Advertisement -
RELATED ARTICLES


