–23 మంది బాలికలకు కంటి అద్దాలు అందజేసిన సర్పంచ్ వెంకటరావు
విశాలాంధ్ర- డుంబ్రిగుడ : 23 మంది బాలికలకు కంటి అద్దాలు పోతంగి పంచాయితీ సర్పంచ్ వెంకట్రావు చేతులు మీదుగామంగళవారంపంపిణీ చేసినట్లు డుంబ్రిగుడ వైద్య అధికారిని అంబిక అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నివారణ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు గత ఏడాది జులై నుండి డిసెంబర్ వరకు ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించబడింది అన్నారు. దృష్టిలోపం కలిగిన విద్యార్థులకు రాష్ట్రంలో94,689 కంటి అద్దాలు ప్రభుత్వం ఉచితంగా మంజూరు చేసిందన్నారు. ప్రధానంగా మండల కేంద్రంలో ఉన్న బాలికల గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల 23 మంది విద్యార్థినిలకు ఉచితంగా కంటి అద్దాలు ఉచితంగా పంపిణీ చేశామన్నారు. విద్యార్థులు తీసుకోవలసిన జాగ్రత్తలపై వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సునీత, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


