Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఆత్మ నిర్బర్ కార్యక్రమములో ధర్మవరం వాసి నాగరాజుకు స్థానం

ఆత్మ నిర్బర్ కార్యక్రమములో ధర్మవరం వాసి నాగరాజుకు స్థానం

- Advertisement -


విశాలాంధ్ర ధర్మవరం: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు పరుస్తున్న ఆత్మనిర్భార్ కార్యక్రమంలొ భాగంగా, దేశంలో తయారగు చేనేత , హస్త కళాకారులకోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఇంటర్నేషనల్ క్రాఫ్ట్ ఫెస్టివల్-న్యూఢిల్లీ కార్యక్రమానికి శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన చేనేత జాతీయ అవార్డు గ్రహీత అయిన జూ జారే నాగరాజుకు ప్రత్యేకంగా ఆహ్వానందినట్లు వారు తెలిపారు. వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమం జనవరి 31వ తేదీ నుండి ఫిబ్రవరి 15వ తేదీ వరకు 16 రోజులపాటు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్ ఫెస్టివల్ లో దేశ నలుమూలాల నుంచే కాకుండా, ఇతర దేశాలు అయిన కెన్య, ఊగాండ, బ్రెజిల్, శ్రీలంక, బేర్ముడా, కువైట్ మొదలగు దేశాల కళాకారులు కూడా పాల్గొన్నారు అని తెలిపారు. ఇందులో భాగంగా న్యూఢిల్లీ లోని, ఫరీదాబాద్ నందలి సూరజ్ ఖండ్ లొ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో తాను కూడా పాల్గొనడం సంతోషంగా ఉందని వారు వ్యక్తం చేశారు. ఈ వేడుకల్లో ధర్మవరం లొ తయారు అవుతున్న పట్టు చీరలు, పట్టు పావడాలు, డ్రెస్ మెటీరియల్, పట్టు పంచలు, పట్టు శాలువాలు, కలంకారి చీరలు మొదలగునవి అమ్మకాలకు ఉంచినట్లు వారు తెలిపారు. ఇటువంటి అవకాశం నాగరాజుకు రావడం పట్ల పట్టణంలోని చేనేత ప్రముఖులు, చేనేత కార్మికులు, స్వచ్ఛంద సేవా సంస్థలు, బంధుమిత్రులు వర్షం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు