- Advertisement -
విశాలాంధ్ర,కదిరి : కదిరి బీసీ సంక్షేమశాఖ ఇంచార్జ్ అధికారిగా సి.లీలావతి బుధవారం బాధ్యతలు చేపట్టారు.అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ఆదేశాలమేరకు ప్రతి రోజు విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన, రుచికరమైన ఆహారాన్ని అందించాలని తెలిపారు.త్వరలో జరగనున్న పదవ తరగతి విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టంతో చదివి వందకు వంద శాతం ఉత్తీర్ణత సాధించడానికి సమిష్టి కృషితో పని చేద్దామని వార్డున్లకు సూచించారు.


