Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఖైదీలకు ఉచిత న్యాయం కొరకు న్యాయవాదులను ఏర్పాటు చేస్తాం

ఖైదీలకు ఉచిత న్యాయం కొరకు న్యాయవాదులను ఏర్పాటు చేస్తాం

- Advertisement -

జిల్లా న్యాయ సేవ అధికారి సంస్థ కార్యదర్శి ఎన్. రాజశేఖర్

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని సబ్ జైల్లో గల ఖైదీలకు ఉచిత న్యాయం కోసం ఉచితంగా న్యాయవాదులను ఏర్పాటు చేస్తామని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ అనంతపురం జిల్లా కార్యదర్శి ఎం. రాజశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని సబ్ జైలును ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం సబ్ జైల్లోని పలు రికార్డులను వారు పరిశీలిస్తూ, ఖైదీల గదులను, వంటగదిలను వారు పరిశీలించారు. అనంతరం వంటగదిలోని బియ్యము, కందిబేళ్లు, కాయగూరల నాణ్యతను కూడా వారు పరిశీలించి భోజనం యొక్క రుచి తీరును కూడా అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఖైదీలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి వారితో నేరుగా మాట్లాడారు. జైల్లో మీకు అన్ని వసతులు ఉన్నాయా? ఏవైనా సమస్యలు ఉన్నాయా? జైలు లో మిమ్మల్ని కలవడానికి బంధువులు వస్తున్నారా? ఏదైనా అసౌకర్యం ఉందా? అన్న విషయాలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ఖైదీలకు ఉచిత న్యాయంతో పాటు ఉచితంగా న్యాయవాదులను ఏర్పాటు చేసి బెయిల్ ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం ఆరో ప్లాంట్ ను వారు పరిశీలించారు. రుచికరమైన భోజనం, ఆరో ప్లాంట్ నీరు ఖైదీలకు ఇచ్చే విధంగా మరింత పటిష్టమైన చర్యలు చేపట్టాలని, ఖైదీలు ఆరోగ్యవంతంగా ఉండేటట్లు చర్యలు కూడా తీసుకోవాలని ఇన్చార్జి సూపర్డెంట్ కు వారు సూచించారు. ఖైదీలు సబ్ జైల్లో సత్ప్రవర్తనతో ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్ జైల్ ఇన్చార్జ్ సూపర్డెంట్ శివరామకృష్ణయ్య, పానెల్ అడ్వకేటులు ప్రసాద్, పెద్దన్న, కోర్టు సిబ్బంది, జైలు సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు