- Advertisement -
విశాలాంధ్ర ధర్మవరం:: ధర్మవరం డిపోకు చెందిన ఓ బస్సులో ఓ ప్రయాణికుడు తన సెల్ ఫోను బస్సులో పెట్టి మరిచిపోయాడు. గమనించిన కండక్టర్ ఆ సెల్లును తన వద్ద ఉంచుకొని, బాధితుడు వచ్చిన వెంటనే ఆ సెల్లును అప్పగించారు. డిపో కండక్టర్ మూర్తి మొబైలను సెక్యూరిటీ హెడ్గార్డ్ రవీంద్ర టిఐ-3 ఎన్సీజీ రావు ఆధ్వర్యంలో సేల్లును అప్పగించారు. కండక్టర్ మూర్తి నిజాయితీకి తోటి ఉద్యోగస్తులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. తదుపరి బాధితుడు కండక్టర్కు కృతజ్ఞతలు తెలియజేశారు.


