Homeతెలంగాణప్రజాకంటక ప్రభుత్వాన్నిసాగనంపుదాం: కూనంనేని

ప్రజాకంటక ప్రభుత్వాన్నిసాగనంపుదాం: కూనంనేని

- Advertisement -

కేంద్రంలోని మోదీ పాలనలో దేశ ప్రజలందరికీ … ముఖ్యంగా కార్మికులు, కర్షకులకు తీరని అన్యాయం జరుగుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శించారు. ప్రజాకంటక ప్రభు త్వాన్ని కూకటివేళ్లతో పీకేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. కేంద్ర కార్మిక సంఘాల సంయుక్త పిలుపులో భాగంగా కార్మిక, కర్షక, ఉద్యోగ, మహిళా, మోటార్, ఆటో, క్యాబ్ వివిధ సంఘాలు సమ్మెల్లో పెద్ద ఎత్తున పాల్గొన్నాయి. చుంచుపల్లి మెయిన్ రోడ్లో నిరసన, ధర్నా నిర్వహించారు. ముఖ్య అతిధిగా పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ 44 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్‌లుగా రూపొందించి కార్మొకుల పొట్ట కొడుతుందని మండిపడ్డారు. మోదీ ప్రభుత్వం కార్పొరేట్ వ్యవస్థలకే వెన్నుదన్నుగా ఉందని ఆరోపించారు. కేవలం మతాన్ని అడ్డుపెట్టుకొని రాజకీ యం చేస్తే పీఠంపై ఉండలేరని హెచ్చరించారు. కార్మికులకు కనీస వేతనాలు పెంచాలనే ఆలోచన బీజేపీ నాయకులకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. సింగరేణిలో బొగ్గుబావుల వేలంతో పాటు కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ విధానాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విత్తన, విద్యుత్ సవరణ బిల్లులను ఉపసంహరించుకోవాలన్నారు. పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని సీడీపీఓకు అందజేశారు. ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కంచర్ల జమలయ్య, సహాయ కార్యదర్శులు గెడార్డు నగేష్, వాసిరెడ్డి మురళీ, పంచాయతీ వర్కర్స్ జిల్లా సహాయ కార్యదర్శి అమర్, అంగన్ వాడీవర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు గోనె మణి, విద్యానగర్ సర్పంచ్ శాంతిప్రియ పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు