Homeజిల్లాలుఅనంతపురంపురుగుల నిర్మూలన దినోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి

పురుగుల నిర్మూలన దినోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి

- Advertisement -

జిల్లా కలెక్టర్ ఆనంద్


విశాలాంధ్ర అనంతపురం టౌన్: పిల్లలకు చదువుతో పాటు మంచి ఆరోగ్యం కూడా చాలా అవసరం అని, విద్యార్థినీ విద్యార్థులు ఆరోగ్యవంతంగా ఉండడం కొరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 17న చేపట్టిన జాతీయ నులిపురుగుల నిర్మూలనా కార్యక్రమమును జిల్లా వ్యాప్తంగా విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ పేర్కొన్నారు. శుక్రవారం అనంతపురము నగరంలోని జిల్లా కలెక్టరేట్ నుండి ఈ ఫిబ్రవరి నెల 17న జాతీయ నులిపురుగుల నిర్మూలనా కార్యక్రమం (నేషనల్ డీ వార్మింగ్ డే) నిర్వహణపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేసే కార్యక్రమం ముందస్తుగా అందేలా చూడాలని, అలాగే జిల్లాలో ఈనెల 17వ తేదీన అన్ని పాఠశాలలు ఇంటర్మీడియట్ ఒకేషనల్ అంగన్వాడి తదితర కేంద్రాల్లో ఆల్బెండజోల్ మాత్రలను పిల్లలకు భోజనం చేసిన తర్వాత 1-2 సం.లోపు పిల్లలకు చప్పరించే ఆల్బెండజోల్ 400 ఎం.జి మాత్రలో సగం, 2-19 సం. ల లోపు వారికి మింగించాలని అన్నారు.
ఈ టెలికాన్ఫరెన్స్ నందు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, డిఈఓ ప్రసాద్ బాబు, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిణి అరుణ, డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం ఆఫీసర్ ఆర్ బీఎస్కే రజిత, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి, డివిఈఓ, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి, ఆర్ఐఓ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు