Homeఉసురు తీస్తున్న ఒత్తిడి

ఉసురు తీస్తున్న ఒత్తిడి

- Advertisement -

సచివాలయ ఉద్యోగుల ఆత్మహత్యల పరంపర

. వీఆర్వోల మరణాలు
. అదనపు పని భారంతో మానసిక కుంగుబాటు
. సమస్యలు పరిష్కరించని ప్రభుత్వం

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: రాష్ట్రంలో అట్టడుగు స్థాయి వరకు పాలనను తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఇప్ప్పుడు ఉద్యోగుల పాలిట మృత్యుపాశంగా మారుతోంది. ఈ వ్యవస్థపై మోపిన అదనపు భారం, అధికారుల వేధింపుల ఆరోపణలతో వెరసి ఉద్యోగుల ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. సచివాలయాల ఉద్యోగుల మరణాలు కొనసాగుతున్న ప్పటికీ ప్రభుత్వంలో కదలిక లేదు. కూటమి ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన ఐదారు నెలల్లోనే 84 మంది చనిపోయారు. గత ప్రభుత్వ హయాంలోనూ మరణాల పరంపర కొనసాగింది. ఆర్థిక ఒత్తిళ్లు, ఆరోగ్య సమస్యల కంటే ప్రధానంగా పని ఒత్తిళ్లే కారణంగా ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. మరోవైపు గ్రామ వార్డు అధికారుల సంఘం (వీఆర్వోల) పరిస్థితి ఇదే తరహాగా ఉంది. చాలా చోట్ల వీఆర్వోలు ఎడాపెడా పని ఒత్తిళ్లతో నలిగి పోతున్నారు. 2019 లో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను గత ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 14 శాఖలకు సంబంధించి 21 విభాగాలలో లక్షా 30 వేల మందిని నియమించారు. ప్రస్తుతం లక్షా 15 వేల నుంచి 20 వేల మంది పని చేస్తున్నట్లు సమాచారం. ఎన్నికల ముందు వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని, ఉద్యోగులకు అండగా ఉంటామని హామీలు ఇచ్చిన కూటమి పాలకులు… అధికారంలోకి వచ్చాక వలంటీర్లను పూర్తిగా పక్కన పెట్టడంతో పాటు వారి బాధ్యతలను గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది పైనే మోపారు. ఫలితంగా క్షేత్రస్థాయిలో పని ఒత్తిడి అసాధారణ స్థాయికి చేరి, విధి నిర్వహణలో ఉన్న యువ ఉద్యోగులు సైతం గుండెపోటుతో కుప్పకూలిపోతున్నారు. ప్రస్తుత గణాంకాలను పరిశీలిస్తే పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయో అర్థమవుతోంది. గత ఏడాది డిసెంబరు నుంచి గ్రామ, వార్డు ఉద్యోగుల మరణాలు కొనసాగుతున్నాయి. ఈ సంఖ్య మరింతగా పెరగడంతో సహచర ఉద్యోగులకు ఆందోళన చెందుతున్నారు.
కడప సచివాలయంలో హెల్త్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న జి.విజయ కుమారి విధి నిర్వహణలో ఉండగానే ఆకస్మికంగా మతి చెందారు. కృష్ణాజిల్లా మోపిదేవికి చెందిన ఏఎనఎం దాసి సబిత పని ఒత్తిడి భరించలేక ఆత్మహత్యకు పాల్పడటం వంటి ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఈ మరణాలన్నీ సహజమైనవి కావని, పని ఒత్తిళ్ల వల్ల జరిగినవేనని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం నేతలు చెబుతున్నారు. ప్రస్తుతం సచివాలయాల్లో ఉద్యోగుల పరిస్థితి అధ్వానంగా మారిం దని, గతంలో సచివాలయానికి తోడుగా ఉన్న 20 మంది వలంటీర్ల పనిని ఇప్ప్పుడు కేవలం ఎనిమిది మంది కార్యదర్శులే చేయాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు. దీనికి తోడు ప్రభుత్వం నిరంతరం కొత్త సర్వేలను తెరపైకి తెస్తోంది. బీపీఎల్ సర్వేలు, ఎలఆరఎస్ క్లియరెన్స్‌లు, మాస్టర్ ప్లాన్ రోడ్ల సర్వేలు, ఇంటింటికీ వాట్సాప్ గవర్నెన్స్ రిజిస్ట్రేషన్లు, అదనంగా ఎన్నికల సంబంధిత పనులు… ఇలా ఒకేసారి పది రకాల బాధ్యతలను ఉద్యోగులపై మోపుతున్నారు. తెల్లవారుజామున 5 గంటల నుంచి క్లస్టర్ మ్యాపింగ్ పేరుతో క్షేత్రస్థాయిలోకి పంపడం, రాత్రి వరకు ఆన్‌లైన్ డేటా ఎంట్రీలు చేయించడం సచివాలయ ఉద్యోగులకు నిత్యకృత్యమైంది. నిర్దేశించిన లక్ష్యాలు పూర్తికాకపోతే మెమోలు ఇస్తామని, జీతాలు నిలిపివేస్తామని ఉన్నతాధికారులు జూమ్ కాన్ఫరెన్స్‌ల ద్వారా బెదిరింపులకు దిగడం ఉద్యోగులను మానసిక కుంగుబాటుకు గురిచేస్తోంది. ఇటువంటి పని పరిస్థితుల వల్ల రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడటమే కాకుండా, ఉన్న వ్యవస్థలో పని చేసే ఉద్యోగుల ప్రాణాలకు రక్షణ లేని పరిస్థితి నెలకొందన్న విమర్శలున్నాయి. సచివాలయ సిబ్బందిని కేవలం డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా మార్చేయడం, వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం వల్ల వ్యవస్థ మొత్తం కుప్పకూలే ప్రమాదం ఉంది. ఉద్యోగ సంఘాల హెచ్చరికలను సైతం ఈ ప్రభుత్వం బేఖాతరు చేస్తూ, ఏసీ గదుల్లో ఉన్నతాధికారులు కూర్చుని లక్ష్యాలు నిర్దేశిస్తూ ఆదేశించడంపై విమర్శలున్నాయి. వరుసగా జరుగుతున్న ఉద్యోగుల మరణాలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి, పని భారాన్ని తగ్గించి, చనిపోయిన వారి కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలన్న డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం తన మొండి వైఖరిని వీడకపోతే… రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ వ్యవస్థ స్తంభించిపోయే అవకాశం ఉంది.
వీఆర్వోల ఆత్మహత్యలు…
రోడ్డు ప్రమాదాలు
రాష్ట్రంలో పని చేస్తున్న గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వోలు) పై పని ఒత్తిడి, అధికారుల ఒత్తిడితో కుంగిపోతున్నారు. విధులను సరిగా నిర్వహించలేకపోతున్నారు. కర్నూలు జిల్లాలో బేతంచెర్ల మండలం ఎం.పెండికర్ల వీఆర్వో రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. కాకినాడ జిల్లాలో అధికారుల ఒత్తిడి వల్ల గొల్లప్రోలు మండల వీఆర్వో పరమేశ్వరరాజు తహసీల్దార్ కార్యాలయం వద్ద నిద్ర మాత్రలు తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వెంటనే ఆస్పత్రికి తీసుకు వెళ్లడంతో ప్రాణాపాయం నుంచి బయట పడ్డారు. ఇప్పటికే ఈ సమస్యను ఉన్నతాధి కారుల దష్టికి తీసుకెళ్లినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఒక వైపు గ్రామ/ వార్డు సచివాలయ ఉన్నతాధికారులు, మరోపక్క రెవెన్యూ ఉన్నతాధికారులు సైతం వీఆర్వోలపై ఒత్తిడి చేయడంతో వారికి ఓపిక నశిస్తున్నది. ఇప్పటికయినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి గ్రామ, వార్డు సచివాలయాý ఉద్యోగుల పైన, వీఆర్వోల పైన పని ఒత్తిళ్లు తగ్గించి… కార్యకలాపాల నిర్వహణ చర్యలకు ప్రభుత్వం ఆదేశించాల్సిన అవసరం ఉంది. లేకుంటే ఈ మరణాలు మరింతగా పెరిగిపోతాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు