Homeసినిమానిర్మాతగా నిత్యామీనన్

నిర్మాతగా నిత్యామీనన్

- Advertisement -

హైదరాబాద్: అందం, అభినయం, నటనతో ప్రేక్షకాదరణ పొందిన ప్రముఖ నటి నిత్యామీనన్… సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించి నిర్మాతగా కొత్త ప్రయాణాన్ని ఆరంభించారు. ‘కీయురి ప్రొడక్షన్స’ పేరుతో స్థాపించిన ఈ బ్యానర్‌ను సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. నటిగా ఎన్నో విజయాలు సాధించిన నిత్య, ఇప్పుడు సినిమాలు రూపొందించే బాధ్యతను కూడా స్వీకరించడం అభిమానుల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. నిత్యామేనన్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఒక ప్రత్యేక వీడియోను పోస్ట్ చేశారు. అందులో తన సొంత నిర్మాణ సంస్థ ‘కీయురి ప్రొడక్షన్స’ ప్రారంభిస్తున్న విషయాన్ని వెల్లడించారు. ఈ వీడియోలో ‘కీయురి’ అనే పేరుకు సంబంధించిన భావాన్ని కూడా ఆమె వివరించారు. కీయూరి భూమి గుహల నుంచి వచ్చిందని, రాతితో చెక్కి, కాంతిని తాకుతూ ఎలాంటి రూపం లేని ఓ గమ్యంగా ఎదిగే భావనను ఈ పేరులో ప్రతిబింబింపజేశామని నటి చెప్పారు. ఈ సంస్థ ద్వారా కేవలం కథలు చెప్పడమే కాకుండా, మనుషుల మనసులను లోతుగా తాకే, ఆలోచింపజేసే చిత్రాలను నిర్మించడమే తన ముఖ్య లక్ష్యమని నిత్య స్పష్టం చేశారు. నిత్య 2021లో విడుదలైన ‘స్కైలాబ’ చిత్రంలో ఆమె నటించడమే కాకుండా సహ నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఆ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను సాధించింది. నిజమైన సంఘటనల ఆధారంగా రూపొందిన ఆ చిత్రం నిత్యకు నిర్మాణ ప్రక్రియపై అవగాహనను ఇచ్చింది. కథ ఎంపిక నుంచి నిర్మాణ నిర్వాహణ వరకు ప్రతి దశలో భాగస్వామ్యం కావడం ద్వారా నిర్మాతగా ఉండే బాధ్యతలను ఆమె తెలుసుకున్నారు. అయితే ‘కీయురి ప్రొడక్షన్స’ మాత్రం పూర్తిగా ఆమె సొంత బ్యానర్. అయితే ఈ బ్యానర్‌పై మొదటి చిత్రం గురించి ఇంకా అధికారిక వివరాలు వెల్లడించలేదు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు