Homeజిల్లాలుపార్వతీపురం మన్యంఘనంగా శ్రీలక్ష్మీనరసింహస్వామి ముడుపుల పూజలు

ఘనంగా శ్రీలక్ష్మీనరసింహస్వామి ముడుపుల పూజలు

- Advertisement -

విశాలాంధ్ర, పార్వతీపురం: జిల్లాలోని సీతానగరం మండల కేంద్రంలో సువర్ణముఖినది ప్రక్క శ్రీలక్ష్మినరసింహస్వామిఆలయంలో గురువారంనాడు ముడుపుల పూజలకుపాత కొత్తభక్తులతో ఆలయం కిటకిటలాడింది.పాతభక్తులతో పాటు కొత్తగాభక్తులు పెద్దఎత్తున పాల్గొని పూజలుచేశారనిఆలయప్రధానఅర్చకులుపీసపాటిశ్రీనివాసాచార్యులు,రామానుజాచార్యులు, టీటీడీ పారాయణకర్త కె.శ్రీనివాసరావులు తెలిపారు. ఆలయంలో ముడుపుల పూజలకు దూరప్రాంతాల నుండి వస్తున్న కొత్తభక్తులతో కిటకిటలాడుతుందని ఆలయఅర్చకులు శ్రీనివాసాచార్యులు, రామానుజాచార్యులుతెలిపారు.భక్తులు
తెచ్చిన వివిధ రకాల పూలదండలు,పూలు స్వామివారికి పెద్ద ఎత్తున అలంకరించిన తీరు అందరిని ఆకట్టుకుంది. ముడుపులు పూజలకు వస్తున్న భక్తులు నిర్మలమైన మనస్సుతో  పూజలుచేస్తూ27సార్లు ఆలయంచుట్టూ మంత్రాల ఉచ్చరిస్తూ ప్రదక్షిణలను పూర్తిచేసి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి తరలి వెళ్తున్నారు. ఈపూజాకార్యక్రమాల్లో ఆలయధర్మకర్త దంపతులు చెలికాని వెంకటగోపాలకృష్ణభారతిలతోపాటుభక్తజనం పెద్ద ఎత్తున పాల్గొని పూజలు నిర్వహించి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి తరలివెళ్లారు. ఈకార్యక్రమంలోప్రధానఅర్చకులతోపాటు ఆమంచిశ్రీనివాసాచార్యులు,కె.మురారి,పవణ్ కళ్యాణ్ ఆచార్యులు, కృష్ణమోహన్ ఆచార్యులు, ఉదయ్ కృష్ణమాచార్యులు,విహారి, ప్రసాద్, శ్రీకర్ ఆచార్యులు, రఘు , కిరీటీ ,భక్తులు,సేవలు పాల్గొన్నారు. మార్చి 31 నుండి ఏప్రిల్ 9 వరకు ఆలయ ప్రాంగణంలో
శ్రీవేణుగోపాలస్వామి,
శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయాల వార్షిక బ్రహ్మోత్సవ మరియు నవ నారసింహయాగ కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. నవ నారసింహ యాగములో పాల్గొనదలచిన భక్తులు ఒకరోజు పూజకోసం ఐదువేల రూపాయలు ముందుగా చెల్లించి పేర్లను నమోదు చేసుకోవాలని ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు రామానుజాచార్యులు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు